
రైతుల ఖాతాల్లోనే పంటనష్ట పరిహారం
వెంకటాపురం(కె): మండల పరిధిలోని వివిధ కంపెనీల బాండ్ మొక్కజొన్న పంటసాగు చేసి నష్టపోయిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే నష్టపరిహారం ఆయా కంపెనీల బాధ్యులు చెల్లించేలా చర్యలు
చేపట్టామని కలెక్టర్ దివాకర అన్నారు. మండల పరిధిలోని యోగితానగర్‌లో బుధవారం కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో బాండ్ మొక్కజొన్న పంట సాగు చేసి నష్టపోయిన రైతులతో మాట్లాడారు. కంపెనీ నిర్వాహకులతో కలిసి రైతులకు కంపెనీ నుంచి ఎంత పెట్టుబడి పెట్టారు.. ఎంత పంటనష్టపోయారనే విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కంపెనీ నుంచి రైతులకు పెట్టుబడి పెడితే పెట్టుబడి పోను మిగిలిన మొత్తం నష్టపరిహారం రైతులకు కంపెనీ చెల్లిస్తుందని వెల్లడించారు.