
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
తాడ్వాయిలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: జిల్లాలో బుధవారం పలుచోట్ల కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యంతో పాటు ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడి పరదాలు కప్పినా తడిసిపోయిందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. చేతికి వచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అలాగే వర్షానికి మేడారం, ఎస్‌ఎస్ తాడ్వాయి మధ్యలో రోడ్డుపై చెట్టు అడ్డుగా పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో వాహనాదారులు రోడ్డుపై చెట్టును కొంతమేర పక్కకు తొలగించడంతో రాకపోకలు కొనసాగాయి.

అకాల వర్షం.. తడిసిన ధాన్యం