పుష్కర గిరాకీ అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

పుష్కర గిరాకీ అంతంతే..

May 22 2025 12:48 AM | Updated on May 22 2025 12:48 AM

పుష్క

పుష్కర గిరాకీ అంతంతే..

కాటారం: పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగిన, ఏ పండుగ రోజు అయిన చిరు వ్యాపారుల ఉపాధికి కొదవ ఉండదు. కాళేశ్వరంలో జరిగే వేడుకలు ఉంటే చాలు జిల్లాతో పాటు వరంగల్‌, కరీంనగర్‌, మంచిర్యాల, హైదరాబాద్‌, మహారాష్ట్రాల నుంచి చిరు వ్యాపారులు ముందుగానే ఇక్కడకు చేరుకొని చిరు వ్యాపారాలు ప్రారంభిస్తారు. పూజాసామాగ్రి, పూసలు, దండల దుకాణాలు, కిచెన్‌ సామగ్రి, వంట పాత్రలు, చిన్న పిల్లల బొమ్మలు, ఆకర్షించే వస్తువులు, ఇంటి అలంకరణ సామగ్రి, కూల్‌డ్రింక్స్‌, టిఫిన్‌ హోటల్స్‌ లాంటివి ఏర్పాటు చేసి భక్తులకు విక్రయిస్తుంటారు. త్రివేణి సంఘమ స్నానం, ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు, మహిళలు, చిన్నారులు చిరు వ్యాపారుల వద్ద తమకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేయడంతో వారికి ఉపాధి లభించేది. గతంలో నిర్వహించిన గోదావరి, ప్రాణహిత పుష్కరాల్లో సైతం పలు ప్రాంతాల నుంచి వచ్చిన చిరువ్యాపారులు తాము తీసుకొచ్చిన వస్తువులను విక్రయించి నాలుగు పైసలు సంపాదించుకున్నారు. కానీ ప్రస్తుతం సరస్వతీ నదికి కొనసాగుతున్న పుష్కరాల్లో చిరు వ్యాపారాలు ఢీలా పడ్డాయి.

భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని..

చిరు వ్యాపారులు ఆశించిన స్థాయిలో వ్యాపారాలు కొనసాగడం లేదు. ఈ నెల 15న సరస్వతీ పుష్కరాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు కావడంతో పాటు వేసవి సెలవు రోజులు కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించిన చిరు వ్యాపారులు ముందుగానే కాళేశ్వరం చేరుకొని తమ దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆలయ పరిసరాలతో పాటు గోదావరి ఘాట్‌కు వెళ్లే రహదారి, సరస్వతీ ఘాట్‌కు వెళ్లే దారి, ప్రధాన ప్రాంతాల్లో పలు రకాల చిరు సామగ్రి విక్రయ దుకా ణాలను వ్యాపారులు పెట్టుకున్నారు. కానీ ఏడు రోజులుగా వారు ఆశించిన స్థాయిలో వ్యాపారం జరగడం లేదు. మొదటి మూడు రోజులు భక్తుల రాక అంతంత మాత్రంగానే ఉండగా వ్యాపారులకు కనీసం బోణీ కూడా కాలేదు. ఆలయ పరిసరాల్లో భక్తులను ఎక్కువ సమయం ఉండనివ్వకపోవడం, భక్తుల రాకపోకల దారులను మారుస్తుండటంతో వ్యాపారాలు సరిగా జరగడం లేదని చిరు వ్యాపారులు తెలిపారు. కాగా ఇప్పటికే పలువురు చిరు వ్యాపారులు గిరాఖీలు లేకపోవడంతో తమ దుకాణాలను ఎత్తేసి వెళ్లిపోయారు. కనీసం తమ పెట్టుబడి అయిన చేతికి వస్తుందో లేదో అని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్కరాలు మరో ఐదు రోజులు మిగిలి ఉండటంతో గిరాఖీలు ఎలా ఉంటాయో అని వారు దిగులు చెందుతున్నారు.

అనుకున్నంత గిరాకీ లేదు..

మాది ఆలయం ఎదుట కూల్‌డ్రింక్స్‌, వాటర్‌ బాటిల్స్‌ దుకాణం. ఏ పండుగ వచ్చిన, ఏ ఉత్సవం జరిగిన మాకు గిరాఖీ చాలా ఉండేది. కానీ ఈ పుష్కరాల్లో గిరాఖీ అనుకున్నంత లేదు.

– సురేశ్‌, చిరువ్యాపారి

ఆశించిన స్థాయిలో జరగని వ్యాపారం

ఏడు రోజులుగా విక్రయాలు

కొద్ది మొత్తంలోనే..

పెట్టుబడి చేతికి వస్తుందో లేదో అని చిరు వ్యాపారుల ఆవేదన

పుష్కర గిరాకీ అంతంతే..1
1/1

పుష్కర గిరాకీ అంతంతే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement