వెంకటాపురం(ఎం)/ఖిలావరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ నెల14న పర్యటించనున్న ప్రపంచ అందాలభామలకు మన సంస్కృతీసంప్రదాయాలు తెలిసేలా సాంస్కృతిక కార్యక్రమాలకు అధికారులు రూపకల్పన చేశారు. మొత్తంగా 116 దేశాల సుందరీమణులు ముందుగా హనుమకొండలోని హరిత హోటల్‌లో కొద్దిసేపు సేదదీరాక.. వేయిస్తంభాల దేవాలయం చేరుకుని రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అక్కడినుంచి రెండు బృందాలుగా విడిపోయి.. ఒక బృందం నేరుగా ములుగు జిల్లా రామప్ప చేరుకోనుంది. మరోబృందం కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ మధ్యకోటకు వెళ్తుంది. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సుందరీమణులు హిందూ సంప్రదాయ దుస్తుల్లోనే సందర్శించనున్నట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు రామప్ప ఆలయం వద్దకు చేరుకున్న వారికి గిరిజన నృత్యంతో కళాకారులు స్వాగతం ప లుకుతారు. కొమ్ముకోయ నృత్యాన్ని ప్రదర్శిస్తూ అలరి స్తారు. వివిధ పూజా, ఇతరత్రా కార్యక్రమాల తర్వాత గార్డెన్‌లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద సాంస్కృతిక ప్రదర్శనలు ఉండనున్నాయి. అలేఖ్య పుంజాల బృందంతో క్లాసికల్ డ్యాన్స్, పేరిణి నృత్యం ఉంటుందని అధికారులు వెల్లడించారు.
కాకతీయుల కళా సంస్కృతిని చాటేలా..
ఖిలావరంగల్ కోటలోని శిల్పాల ప్రాంగణంలో పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గజ్జల రంజిత్‌కుమార్ నేతృత్వంలో 5 నిమిషాల నిడివిగల పేరిణి శివ తాండవ నృత్యాన్ని ప్రదర్శించనున్నారు. కాకతీయుల కళా సంస్కృతిని ప్రపంచానికి చాటే విధంగా అద్భుతమైన ప్రదర్శన చేయనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
అందాలభామలనుఅబ్బురపర్చేలా ప్రదర్శనలు
రామప్ప వద్ద గిరిజన, కొమ్ముకోయ నృత్యాలు
ఖిలావరంగల్ కోటలో పేరిణి శివతాండవం
ఏర్పాట్లు చేస్తున్న టూరిజం, జిల్లాల అధికారులు
సంప్రదాయ దుస్తుల్లో రామప్పకు సుందరీమణులు
మన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా..
మన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా..