
ఆర్మీలో ఉద్యోగం నా కల
మహబూబాబాద్ అర్బన్: నా చిన్నతనం నుంచే పోలీస్, ఆర్మీలో చేరాలన్నది నా కల. 2012లో ఆర్మీ ఉద్యోగానికి ఎంపికయ్యాను. ఆడపిల్లవు, ఆర్మీ అంటే ప్రాణాలతో చెలగాటం.. అని అమ్మ భయపడింది. కానీ, ఈరోజుల్లో ఆడపిల్లలు విమానాలు, రాకెట్లు నడపుతున్నారు.. దేశాలు దాటి అమ్మాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు.. నేను దేశంలోనే ఉంటూ దేశంకోసం పనిచేస్తానని అమ్మకు నచ్చజెప్పా. గుజరాత్, జమ్మూకశ్మీ ర్, న్యూఢిల్లీలో పనిచేశా. ప్రస్తుతం హైదరాబాద్‌లో రాపిడ్‌యాక్షన్ ఫోర్స్‌లో విధులు నిర్వహిస్తున్నాను.
– ఎడ్ల ఝాన్సీ, మానుకోట