
రామప్పను సందర్శించిన హనుమకొండ జిల్లా జడ్జి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని హనుమకొండ జిల్లా ప్రిన్సిపాల్ జడ్జి జస్టిస్ పట్టాభి రామారావు, ములుగు సీనియర్ సివిల్ జడ్జి కన్నయ్య లాల్‌తో కలిసి శుక్రవారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేష్ వివరించగా రామప్ప శిల్పాకళాసంపద బాగుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్సై జక్కుల సతీష్ ఉన్నారు.
ములుగు రూరల్: ఆదిదేవత గట్టమ్మ తల్లిని ములుగు జిల్లా ఇన్‌చార్జ్ జడ్జి పట్టాభి రామారావు, జిల్లా జడ్జి కన్నయ్యలాల్, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోత్స్నలు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ మేరకు అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన పూజారి కొత్త సదయ్య, కొత్త సురేందర్‌లు జడ్జిలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు పాల్గొన్నారు.
పనులు త్వరగా
పూర్తి చేయాలి
వెంకటాపురం(ఎం): మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మే 14న రామప్ప ఆలయానికి వస్తున్న నేపథ్యంలో రామప్పలో తలపెట్టిన పనులు రేపటి (ఆదివారం)లోగా పూర్తి చేయాలని అదనపు క లెక్టర్ మహేందర్ జీ సంబంధిత అధికారులను సూచించారు. శుక్రవారం రామప్ప సరస్సుకట్టపై కాటేజీల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గురుకుల కళాశాలలో
ప్రవేశానికి కౌన్సెలింగ్
ములుగు రూరల్: ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ రీజియన్ గిరిజన గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఆసక్తి కలిగిన గిరిజన బాలురు, బాలికలు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని ఆర్సీఓ హరిసింగ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన బాలురకు ఏటూరునాగారం స్పోర్ట్స్ స్కూల్, 16న బాలికలకు ఏటూరునాగారం ఈజేసీ కళాశాలలో కౌన్సెలింగ్ ఉదయం 10 గంటలకు ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థులు పదో తరగతి మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కులం, ఆదా యం, నివాసం రిజినల్ సర్టిఫికెట్లు, నాలుగు పాస్ ఫొటోలు, 2 సెట్ల జిరాక్స్‌లను తీసుకురా వాలన్నారు. బాలుర కళాశాల వివరాలు కా టారంలో ఎంపీసీ, బీపీసీ, ఏటూరునాగారంలో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, ములుగు ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, దామరవంచలో ఎంపీసీ, బీపీసీ, మహబూబాబాద్‌లో ఎంపీసీ, బీపీసీ, మరి పెడలో ఎంపీసీ, బీపీసీ, రెడ్యాలలో సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో అవకాశం ఉందని, బాలి కల కళాశాల కాటారంలో ఎంపీసీ, బీపీసీ, పీటీ, ఏటూరునాగారంలో ఎంపీసీ, బీపీసీ, సీ ఈసీ, ఏటీ, ఐఎం, వెంకటాపురంలో ఎంపీసీ, బీపీసీ, కొత్తగూడలో ఎంపీసీ, బీపీసీ, సీఈసీ, కేసముద్రంలో సీఈసీ, హెచ్‌ఈసీ, మహబూబాబాద్‌లో ఎంపీసీ, బీపీసీలో అవకాశం ఉందన్నారు.

రామప్పను సందర్శించిన హనుమకొండ జిల్లా జడ్జి