
రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి
గోవిందరావుపేట: ధాన్యం కొనుగోల్లలో రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వెంకట్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పస్రా పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి ఆద్వర్యంలో మండల కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకట్‌రెడ్డి హాజరై మాట్లాడారు. మండల పరిధిలో 20రోజుల నుంచి కురుస్తున్న వడగండ్ల వానలతో కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని బయటకు తీయడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులు తీవ్రంగా రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో కొంతమంది రైతులు సన్నధాన్యం పండించగా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదన్నారు. దీంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని వివరించారు. ఈ కార్యక్రమంలో పొదిళ్ల చిట్బిబాబు, తీగల ఆదిరెడ్డి, గొంది రాజేశ్, గుండు రామస్వామి, అంబాల మురళి, సూర్యనారయణ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వెంకట్‌రెడ్డి