వెంకటాపురం(కె): మావోయిస్టుల కదలికలపై అనునిత్యం దృష్టి సారించాలని ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సిబ్బందికి సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆయన సోమవారం తనిఖీ చేసి మాట్లాడారు. సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మావోయిస్టులు అమాయక ఆదివాసీ ప్రజలను ప్రభావితం చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో కేసులలో అరెస్టు అయిన మావోయిస్టు పార్టీ సభ్యులను, సానుభూతి పరులను అనునిత్యం పర్యవేక్షిస్తుండాలని అదేశించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిఽధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కమెండ్ కంట్రోల్ రూమ్‌లో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు, తదితరులు ఉన్నారు.
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ