ములుగు: ఓటరు జాబితా రూపకల్పన, నవీకరణకు రాజకీయ పార్టీల సహకారం అవసరమని జిల్లా డిప్యూటీ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ సీహెచ్.మహేందర్‌జీ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన ప్రతీ ఓటరు జాబితాలో పేర్లు ఉండేలా చూసుకోవాలన్నారు. గతేడాది నవంబర్ నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నూతన ఓటరుగా నమోదు చేసుకున్న 1172మంది విచారణ పూర్తి చేశామన్నారు. మరో 52 పెండిగ్‌లో ఉన్నాయని వివరించారు. ఫారం–7 ద్వారా 290 దరఖాస్తులకు గానూ 94 విచారణ పూర్తి చేసినట్లు తెలిపారు. కరెక్షన్ కోసం 1,257 దరఖాస్తులు రాగా అందులో 916 విచారణ పూర్తి చేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు బూతుస్థాయి ఏజెంట్లను నియమించి జాబితాను అందించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ విజయభాస్కర్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సలీం తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్‌జీ