ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించడానికి ఈసారి రూ.23,108 కోట్లు కేటాయించింది. దీంతో సర్కారు చదువులకు ఇంకా మంచి జరగనుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 20–25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ తలపెట్టిన ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి జిల్లాకు రూ.1400 కోట్లతో ఏడింటిని మంజూరు చేసింది. ఈ బడ్జెట్‌తో ఈసారి ఆ స్కూళ్లు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, వరంగల్‌లో మొత్తం 3,331 ప్రభుత్వ బడులు ఉండగా, అందులో 4,67,011 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీలతోపాటు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈసారి నిధులు వెచ్చించే అవకాశం ఉంది.