సైక్లింగ్‌ పోటీల్లో ప్రతిభ చూపాలి | - | Sakshi
Sakshi News home page

సైక్లింగ్‌ పోటీల్లో ప్రతిభ చూపాలి

Mar 8 2025 1:48 AM | Updated on Mar 8 2025 1:45 AM

ములుగు: నేడు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సైక్లింగ్‌ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపి ములుగు జిల్లాకు మంచిపేరును తీసుకురావాలని సైక్లింగ్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌లో జిల్లా యువజన క్రీడల శాఖ కార్యాలయం ఎదుట 24మంది సైక్లింగ్‌ క్రీడాకారులకు శుక్రవారం సుమారు రూ.10వేలు విలువ చేసే టీ షర్టులను ఆయన అందజేశారు. రాష్ట్రస్థాయిలో విజయం సాధించే క్రీడాకారులకు తనవంతుగా సైకిళ్లను బహుమతిగా అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్‌ఓ తుల రవి, కోచ్‌ శ్రీరాంనాయక్‌, రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి ఎలగందుల మోహన్‌ పాల్గొన్నారు.

ఓఎస్డీ గీతే మహేశ్‌

బాబాసాహెబ్‌ బదిలీ

ములుగు: ములుగు ఓఎస్డీ గీతే మహేశ్‌ బాబాసాహెబ్‌ ప్రమోషన్‌పై రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా శుక్రవారం బదిలీ అయ్యారు, 2024 మార్చి 15న ఏటూరునాగారం ఏఎస్పీగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ నుంచి ములుగు ఓఎస్డీగా బదిలీ అయ్యారు. ఆయన హయాంలో 15 మంది ఆయా కేటగిరీల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ కమాండర్లు, దళసభ్యులు, మిలిషియా సభ్యులు 12మంది లొంగిపోగా ముగ్గురు సానుభూతి పరులు పట్టుబడ్డారు.

కొండాయి బ్రిడ్జికి

రూ.16 కోట్లు మంజూరు

ఏటూరునాగారం: 2023లో కూలిపోయిన కొండాయి బ్రిడ్జి ప్రాంతంలో నూతనంగా హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించేందుకు ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా శుక్రవారం రూ.16 కోట్లు మంజూరు అయినట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. అయితే గతంలో రూ.9 కోట్లు మంజూరు కాగా బ్రిడ్జి పొడువు, ఎత్తు పెంచడంతో ఎస్టీమేట్‌ కూడా పెరిగినట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు చేపడుతామని అధికారులు వివరించారు.

విద్యుత్‌ అంతరాయానికి సహకరించాలి

ములుగు రూరల్‌: విద్యుత్‌ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్‌శాఖ డీఈ నాగేశ్వరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 9నుంచి 12 గంటల వరకు 33/11 కేవీ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా ములుగు, పత్తిపల్లి, మల్లంపల్లి, రాంచంద్రాపురం, పస్రా, గోవిందరావుపేట, వెల్తుర్లపల్లి, వెంకటాపురం(ఎం), ఎస్‌ఎస్‌ తాడ్వాయి, మేడారం, ఏటూరునాగారం, కమలాపూర్‌, కన్నాయిగూడెం, వాజేడు, మంగపేట, రాజుపేట, ఆలుబాక, మల్లూరు గ్రామాలలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

రైస్‌మిల్‌ సీజ్‌

ములుగు: రూ.2,16,98,407 విలువ గల ధాన్యాన్ని యాజమాన్యం పక్కదారి పట్టించినట్లుగా గుర్తించి మల్లంపల్లి మండల పరిధిలోని రామచంద్రాపురంలో గల ఉమ బిన్ని రైస్‌మిల్‌ను సీజ్‌ చేసినట్లు సివిల్‌ సప్లయీస్‌ డీఎం రాంపతి తెలిపారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు నితీష్‌, రాంచందర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌తో కలిసి శుక్రవారం ఆయన రైస్‌ మిల్‌ను తనిఖీ చేశారు. 2023–24 వార్షిక కాలానికి రైస్‌మిల్‌ 604.628 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్‌ రూపేణ అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు అందించలేదని తెలిపారు. దీంతో మిల్లు యజమాని భూక్య ఉమాదేవిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

సైక్లింగ్‌ పోటీల్లో  ప్రతిభ చూపాలి
1
1/2

సైక్లింగ్‌ పోటీల్లో ప్రతిభ చూపాలి

సైక్లింగ్‌ పోటీల్లో  ప్రతిభ చూపాలి
2
2/2

సైక్లింగ్‌ పోటీల్లో ప్రతిభ చూపాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement