
వాజ్‌పేయి సేవలు మరువలేనివి..
ములుగు రూరల్: వాజ్‌పేయి దేశ ప్రధానమంత్రిగా రెండుసార్లు పనిచేసి పేదల అభ్యున్నతికి చేసిన సేవలు మరువలేనివని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. జిల్లా కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ వద్ద బుధవారం వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ములుగు ఏరియా ఆస్పత్రిలోని రోగులకు బలరాం పండ్లు పంపిణీ చేసి మాట్లాడారు. వాజ్‌పేయి దేశానికి రెండు సార్లు ప్రధాన మంత్రిగా పనిచేశారని తెలిపారు. ఆ క్రమంలో నిరుపేదల సంక్షేమానికి ఆయన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని వివరించారు. వాజ్‌పేయి తన చివరి శ్వాస వరకు దేశం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రవీంద్రాచారి, కృష్ణాకర్, భూక్య జవహర్‌లాల్, రాజ్‌కుమార్, దొంతి రవిరెడ్డి, గాదం కుమార్, మహేందర్, శ్రీనివాస్, సమ్మయ్య, హేమాద్రి, కట్టయ్య, ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం