
‘‘నా చేతుల మీదుగా శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ అంచలంచెలుగా ఎదిగి, టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థల జాబితాలో చోటు సంపాదించుకోవాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ తెలిపారు.
VV Vinayak Launched Sri Ishta Kameswara Creations Logo: ‘ప్రేమంటే సులువు కాదురా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన చందా గోవిందరెడ్డి నిర్మాతగా మారారు. శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్ అనే నూతన నిర్మాణ సంస్థను నెలకొల్పారు. ఈ బ్యానర్ లోగోని దర్శకుడు వీవీ వినాయక్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ–‘‘నా చేతుల మీదుగా శ్రీ ఇష్ట కామేశ్వర క్రియేషన్స్ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ బ్యానర్ అంచలంచెలుగా ఎదిగి, టాలీవుడ్‌లో అగ్ర నిర్మాణ సంస్థల జాబితాలో చోటు సంపాదించుకోవాలి’’ అని తెలిపారు.
‘‘మా ఇలవేల్పు శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి పేరిట బ్యానర్ స్థాపించడం హ్యాపీ. తొలి చిత్రంగా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని రూపొందించనున్నాను. పూర్తి వివరాలు త్వరలోనే చెబుతాను’’ అని చందా గోవిందరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దర్శకుడు కె.సాగర్, ‘రఫ్’ చిత్ర డైరెక్టర్ సుబ్బారెడ్డి, సీనియర్ కో–డైరక్టర్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు.