
సినిమా రివ్యూల విషయంలో ఎప్పుడూ వివాదం, ఆంక్షలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే, తాజాగా ఒక యూట్యూబర్పై సినీ నిర్మాత ఫిర్యాదు చేశారు. తనను డబ్బు డిమాండ్ చేశాడని, ఇవ్వకుంటే తన సినిమాకు నెగిటివ్ రివ్యూ ఇస్తానని చెప్పినట్లు పోలీసులకు ఆ నిర్మాత ఫిర్యాదు చేశారు. దీంతో సదురు యూట్యూబర్ను పోలీసులు విచారించారు.
రీసెంట్గా వర్జిన్ బాయ్స్ సినిమా విడుదలైంది. చాలా కష్టపడి సినిమా చేశామని అందరూ ఆదరించాలని నిర్మాత రాజా దారపునేని కోరారు. అయితే, సినిమా విడుదల తర్వాత యూట్యూబర్ నవీన్ ఇచ్చిన రివ్యూపై ఆయన మండిపడ్డారు. పూలచొక్కా పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ను నవీన్ రన్ చేస్తున్నాడు. సోషల్మీడియాలో చాలా కాలంగా సినిమా రివ్యూలు చెప్తూ ఉంటాడు.
అయితే, పూల చొక్క నవీన్ తనను రూ. 40 వేలు డబ్బు డిమాండ్ చేశాడని వర్జిన్ బాయ్స్ నిర్మాత రాజా దారపునేని ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాడు. దీంతో అతనిపై కేసు నమోదైంది. సినిమా రివ్యూ మంచిగా ఇవ్వాలంటే డబ్బు ఇవ్వాలని లేకపోతే నెగిటివ్ రివ్యూ ఇస్తానని తనని బెదిరించినట్లు ఆ చిత్ర నిర్మాత ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే, పూల చొక్క నవీన్ను స్టేషన్కు పిలిపించి విచారించిన పోలీసులు తిరిగి పంపించేశారు.
సినిమా రివ్యూ ఇవ్వాలంటే రూ.40 వేలు ఇవ్వాల్సిందే.. పూల చొక్కా బెదిరింపులు
సినిమా రివ్యూ పై బేరసారాలు... నిర్మాత ఒప్పుకోక పోవడంతో నెగెటివ్ రివ్యూ రాస్తాను అంటూ బెదిరింపులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన నిర్మాత.. విచారణకు పిలిచిన పోలీసులు pic.twitter.com/W4pfXXNiZx— Telugu Scribe (@TeluguScribe) July 17, 2025