కరోనా రోగికి హీరో నిఖిల్ సాయం

కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను గడగడలాడిస్తోంది. చేయి చేయి కలిపినా, మాస్క్ లేకుండా కనిపించినా, పార్టీలంటూ, వినోదమంటూ పదే పదే బయట తిరిగినా మన ఒంట్లోకి ప్రవేశించేందుకు రెడీగా ఉందీ కరోనా. సవాలక్ష జాగ్రత్తలు తీసుకున్నవారు కూడా ఎక్కడో ఒకచోట చిన్న పొరపాటు చేసినా ఆ మాయదారి రోగం బారిన పడుతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరినీ ముప్పు తిప్పలు పెడుతుందీ కరోనా. తెలుగు రాష్ట్రాల్లో కూడా దీని ఉధృతి విపరీతంగా ఉంది.
అదే సమయంలో కరోనా వైరస్‌ను నివారించే వ్యాక్సిన్స్‌ల కొరత కూడా అధికంగానే ఉంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి కరోనాతో బాధపడుతున్న తన తండ్రికి రెమిడిసివిర్ ఇప్పించాలంటూ హీరో నిఖిల్‌ను ట్విటర్‌లో సంప్రదించాడు. దయచేసి మాకు సాయం చేయండంటూ చేతులెత్తి వేడుకున్నాడు. దీనిపై పెద్ద మనసుతో స్పందించిన హీరో.. 'సిరివూరి రాజేశ్ వర్మ మీకు అవసరమయ్యేన్ని రెమిడిసివిర్ డోసులతో మిమ్మల్ని సంప్రదిస్తాడు. మీ నాన్నగారికి త్వరలోనే నయమవుతుంది' అని భరోసా కల్పించాడు.
Will get it done...
Sirivuri Rajesh Varma will contact you. With the Required doses of #Remdisivir .
Wishing your father a Speedy recovery. https://t.co/khN8bjLEYz— Nikhil Siddhartha (@actor_Nikhil) April 20, 2021