Anasuya Bharadwaj: ఉసురు తగులుతుందంటూ అనసూయ ట్వీట్‌, రౌడీ హీరో ఫ్యాన్స్‌ ఫైర్‌

Vijay Devarakonda Fans Fire On Anasuya Tweet - Sakshi

యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తోంది. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా సోషల్‌ మీడియాలో మాత్రం అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. 'అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమోకానీ రావడం మాత్రం పక్కా. ఒకరు బాధపడుతుంటే చూసి సంతోషించే రకం కాదు, కానీ నమ్మకం నిజమైంది' అని రాసుకొచ్చింది.

ఇది చూసిన నెటిజన్లు ఎవరిని అంటున్నావో కొంచెం క్లారిటీ ఇవ్వు అని అడుగుతున్నారు. మరికొందరు మాత్రం విజయ్‌ దేవరకొండ మీద అంత అక్కసు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కాగా అర్జున్‌రెడ్డి సినిమాలో అమ్మను తిట్టిన డైలాగ్‌ ఎంతో ఫేమస్‌ అయింది. అలా ఒక హీరో అమ్మను తిట్టడమేంటి? అని అనసూయ సహా చాలామంది దాన్ని తప్పుపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రౌడీ హీరో నటించిన లైగర్‌ సినిమా నేడు రిలీజైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తుండటంతో అతడికి ఉసురు తగిలే పరాజయం పాలవుతున్నాడని అనసూయ అంటోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

అయితే అనసూయ ఇంతలా ద్వేషం పెంచుకోవడమేంటని చాలామంది నెటిజన్లు ఆమెను ఏకిపారేస్తున్నారు. సినిమా డైలాగ్‌కే ఉసురు అని మాట్లాడితే.. నువ్వు యాంకరింగ్‌ చేసిన కామెడీ షోలో నిత్యం ఎన్నో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ దొర్లుతూ ఉంటాయి. మరి వారందరూ ఏమైపోవాలి? అని నిలదీస్తున్నారు. సినిమాను సినిమాలా చూడాలి కానీ ఒక హీరోకు శాపనార్థాలు పెట్టడం కరెక్ట్‌ కాదని మండిపడుతున్నారు విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌.

చదవండి: గుండెపోటు.. 15 రోజుల తర్వాత స్పృహలోకి..
బెడ్‌రూమ్‌లో దొంగాపోలీసు ఆటలు ఆడలేదా? ఇబ్బంది పడ్డ హీరోయిన్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top