రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు.. ఆత్మకథ ఆవిష్కరణలో బ్రహ్మనందం | Tollywood Comedian Brahmanandam Auto biography Book Release | Sakshi
Sakshi News home page

Brahmanandam: రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు.. ఆత్మకథ ఆవిష్కరణలో బ్రహ్మనందం

Sep 12 2025 8:04 PM | Updated on Sep 12 2025 8:49 PM

Tollywood Comedian Brahmanandam Auto biography Book Release

టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మనందం ఆత్మకథ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఈ బయోగ్రఫీని బుక్‌ను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. మీ అండ్ మై పేరుతో ఈ పుస్తకాన్ని రాశారు. ఈ బుక్‌ను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మనందం పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ పుస్తకం రాసేందుకు ఎందరో నాకు స్పూర్తినిచ్చారని అన్నారు.  నేను పేద కుటుంబం నుంచి వచ్చానని.. లెక్చరర్‌గా పనిచేశాకే.. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చానని తెలిపారు. నటరాజ ఆశీర్వాదంతో 1200 సినిమాల్లో  నటించానని వెల్లడించారు.

బ్రహ్మనందం మాట్లాడుతూ..' నేనెందుకు ఆత్మకథ రాశాను అనేది పెద్ద ప్రశ్న. నాకు ఎటువంటి పొలిటికల్, ఫైనాన్షియల్ బ్యాక్ గ్రౌండ్ లేదు. నా జీవితం గురించి మాత్రమే పుస్తకంలో రాశా. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు.  బురద నుంచి కమలం పుడుతుంది. కష్టపడి పనిచేస్తే విజయం వరిస్తుంది. నాకు వెంకయ్య నాయుడు ఎంతో స్పూర్తి. ఈ మధ్య గ్లోబల్ కమెడియన్ అవార్డ్ ఇచ్చారు. మీమ్స్ బాయ్‌గా కూడా మార్చారని' అన్నారు.

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..' యువకుడిగా ఉన్నపుడు రాజకీయాల్లోకి వచ్చా. నాకు మీడియాతో ప్రత్యేక అనుబంధం ఉంది. బ్రహ్మానందం జీవిత చరిత్ర పుస్తకం హిందీ,  ఇంగ్లీష్‌లో విడుదలైంది. భారత దేశ చలనచిత్రలో ప్రత్యేకతను సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం. స్క్రీన్‌పై ఆయన కనిపిస్తే అందరూ ఆనంద పడేస్తారు. ఎప్పటికీ అందరికీ బ్రహ్మానందం ఫేవరేట్. ఆయన సినిమాలు చూస్తే జనం ఎంజాయ్ చేస్తారు. ఇండియన్ స్క్రీన్ 
ప్రతిఒక్కరూ మాతృ భాషను నేర్చుకోవాలి, ఆదరించాలి, దాంతో పాటూ ఇతర భాషలు నేర్చుకోవాలి.  దేశంలో ఎక్కువ మందికి చేరువ కావాలంటే హిందీ భాష అవసరం. ప్రపంచవ్యాప్తంగా చేరువ కావాలంటే ఇంగ్లీష్ అవసరం. భారత అభివృద్ధిని చూసి కొన్ని దేశాలు తట్టుకోలేక పోతున్నాయి. ప్రపంచంలో రెండో ఆర్థిక దేశంగా 2035 నాటికి ఇండియా ఎదగటం ఖాయం' అని అన్నారు.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement