Thimmarusu Review: తిమ్మరుసు సినిమా ఎలాగుందంటే?

Thimmarusu Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌ : తిమ్మరుసు
జానర్ : క్రైమ్‌ థ్రిల్లర్‌
నటీనటులు :  సత్యదేవ్‌, ప్రియాంక జవాల్కర్‌
నిర్మాణ సంస్థ : యూవీ క్రియేషన్స్‌
నిర్మాతలు :  మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు
దర్శకత్వం :  శరణ్‌ కొప్పిశెట్టి
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ : అప్పు ప్రభాకర్‌
ఎడిటర్‌ : తమ్మి రాజు
విడుదల తేది : జూలై 30, 2021

'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'తో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు సత్యదేవ్‌. డిఫరెంట్‌ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరించిన ఈ హీరో ఇప్పుడు లాయర్‌ అవతారమెత్తాడు. కానీ కేసు పేరుతో డబ్బులు గుంజే లాయర్‌గా కాదు, కేసును గెలిపించడం కోసం జేబులోని డబ్బును కూడా నీళ్లలా ఖర్చుపెట్టే న్యాయవాదిగా! ఈ మధ్య వచ్చిన 'నాంది', 'వకీల్‌ సాబ్‌' వంటి కోర్టు రూమ్‌ డ్రామా చిత్రాలు బాగా ఆడటంతో తను నటించిన 'తిమ్మరుసు' సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని కొండంత ధీమా పెట్టుకున్నాడు సత్యదేవ్‌. మరి అతడి నమ్మకం నిజమైందా? అసలు తిమ్మరుసు అన్న టైటిల్‌ ఈ చిత్రానికి సెట్టయ్యిందా? అసలే బాలీవుడ్‌లోనూ కాలు మోపబోతున్న అతడికి ఈ సినిమా ప్లస్‌గా మారనుందా? మైనస్‌ అవనుందా? అనే విషయాలన్నీ కింది రివ్యూలో ఓ రౌండేద్దాం..

కథ
శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అతడి పేరును టైటిల్‌గా పెట్టుకున్నారంటేనే తెలిసిపోతోంది హీరో చాలా తెలివైనవాడని. ఈ సినిమాలో సత్యదేవ్‌ ఇంటెలిజెంట్‌ లాయర్‌గా నటించాడు. అతడు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్‌ డ్రైవర్‌ మర్డర్‌ కేసును రీఓపెన్‌ చేస్తాడు. అతడి హత్య వెనకాల ఉన్న మిస్టరీని చేధించే పనిలో పడతాడు. ఈ క్రమంలో ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుర్రాడికి ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకుంటాడు.

మరి ఇందులో ఆ అబ్బాయిని ఎవరు? ఎందుకు ఇరికించారు? ఇందులో పోలీసుల ప్రమేయం ఎంతమేరకు ఉంది? అసలు ఆ క్యాబ్‌ డ్రైవర్‌ను ఎందుకు హత్య చేస్తారు? ఈ చిక్కుముడులను అన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే రామచంద్ర చివరాఖరకు కేసు గెలుస్తాడా? అతడు ఇంతలా ఇన్వాల్వ్‌ కావడానికి ఆ కేసుతో ఇతడికేమైనా సంబంధం ఉందా? ఆ కేసు స్టడీ చేసే రామచంద్రకు పోలీసులు ఎందుకు సహకరించరు? అన్న వివరాలు తెలియాలంటే బాక్సాఫీస్‌కు వెళ్లి బొమ్మ చూడాల్సిందే!

విశ్లేషణ
'బీర్బర్‌' సినిమాకు రీమేక్‌గా వచ్చిందే తిమ్మరుసు. ఈ సినిమా ఫస్టాఫ్‌ యావరేజ్‌గా ఉన్నప్పటికీ సెకండాఫ్‌ మాత్రం బాగుంది. ప్రియాంక జవాల్కర్‌ తన అందంతో, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్‌ను బుట్టలో వేసుకోవడం ఖాయం. బ్రహ్మాజీ కామెడీ సినిమాకు ప్రధాన బలం. బీజీఎమ్‌ మరొక హైలైట్‌ అని చెప్పవచ్చు. మర్డర్‌ కేసును చేధించే పనిలో పడ్డ హీరో ఒక్కో క్లూను కనుక్కోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, ట్విస్టులు ప్రేక్షకుడిని సీటులో అతుక్కుపోయేలా చేస్తాయి. సినిమాటోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ కథనం కొంత వీక్‌గా ఉన్నట్లు అనిపించక మానదు. ఫస్టాఫ్‌ మీద ఇంకాస్త దృష్టి పెట్టుంటే సినిమా ఇంకో రేంజ్‌లో ఉండేది!

నటీనటులు
యాక్టింగ్‌ అంటే పిచ్చి అని చెప్పుకునే సత్యదేవ్‌ ఈ సినిమాలో ఎలా నటించాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఓవైపు సాఫ్ట్‌గా కనిపిస్తూనే మరోవైపు ఫైట్‌ సీన్లలోనూ ఇరగదీశాడు. లాయర్‌ పాత్రకు ఆయన పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. ఇక టాక్సీవాలా హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ బాగానే నటించింది. బ్రహ్మాజీ ఎప్పటిలాగే ప్రేక్షకులను వీలైనంత నవ్వించేందుకు ట్రై చేశాడు. మిగతా నటీనటులు కూడా సినిమాను సక్సెస్‌ దిశగా నడిపించేందుకు తెగ కష్టపడ్డట్లు తెలుస్తోంది.

ప్లస్‌
సత్యదేవ్‌ నటన
ట్విస్టులు
ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌

మైనస్‌
ఫస్టాఫ్‌ వీక్‌గా ఉండటం

Rating:  
(2.5/5)

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top