ఓటీటీ: ఆహాలో ‘తరగతి గది దాటి’ వెబ్‌ సిరీస్‌ | Tharagathi Gadhi Dati Web Series Streaming On Aha On August 20th | Sakshi
Sakshi News home page

OTT: ఆహాలో ‘తరగతి గది దాటి’ వెబ్‌ సిరీస్‌

Aug 18 2021 5:32 PM | Updated on Aug 18 2021 5:34 PM

Tharagathi Gadhi Dati Web Series Streaming On Aha On August 20th - Sakshi

తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకులకు చేరువవుతోంది. ముఖ్యంగా కరోనా టైమ్‌ ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి కలిసొచ్చిన కాలమనే చెప్పాలి. ఆ సమయంలో మంచి సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందించడంతో ఆహా... ఒక్కసారిగా టాప్‌లోకి చేరింది. ఓవైపు వెబ్‌సిరీస్‌లు, మరో సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఫుల్‌ మీల్స్‌ను అందిస్తోంది. ఆదరణను రెట్టింపు చేసుకునే దిశగా తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన నీడ, సూపర్‌ డీలక్స్‌ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనుంది.

ఇక ఇటీవల అమల పాల్‌ నటించిన ‘కుడి ఎడమైతే’ వెబ్‌ సిరీస్‌ను అందించిన ఆహా... ఇప్పుడు అదే క్రమంలో మరో కొత్త సిరీస్‌ను అందుబాటులోకి తెస్తోంది. ‘తరగతి గది దాటి’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను సోమవారం పీవీపీ మాల్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా మేకర్స్‌ మాట్లాడుతూ.. ఇద్దరు టీనేజర్ల మధ్య ఏర్పడ్డ అందమైన ప్రేమ కథను వినూత్నంగా చూపిస్తున్నామన్నారు. ‘పెళ్లిగోల’ వెబ్‌ సిరీస్‌తో ఆకట్టుకున్న మల్లిక్‌ ‘తరగతి గది దాటి’కి దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ వెబ్‌ సిరీస్‌లో హర్షిత్‌ రెడ్డి, పాయల్‌ రాధాకృష్ణ, నిఖిల్‌ దేవాదుల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ సిరిస్‌ రాజమండ్రి నేపథ్యంగా నడుస్తుందన్నారు. ఈ వెబ్‌ సిరీస్‌ను మొత్తం 5 ఎపిసోడ్లుగా విడుదల చేయనున్నారు. మరో క్యూట్‌ లవ్‌ స్టోరీ రూపంలో డిజిటల్‌ ప్రేక్షకులకు ఆకట్టుకోవడానికి వస్తోన్న ఈ వెబ్‌ సిరీస్‌ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.  ఈ వెబ్‌ సీరీస్‌ ఆగస్ట్‌ 20న ఆహా లో విడుదల అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement