ఓటీటీకి టాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్‌.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! | Tollywood Comedy Web Series Streaming In Ott On this date | Sakshi
Sakshi News home page

Tollywood Web Series: బిగ్‌బాస్ రన్నరప్‌ కామెడీ వెబ్ సిరీస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Nov 8 2024 2:17 PM | Updated on Nov 8 2024 3:02 PM

Tollywood Comedy Web Series Streaming In Ott On this date

సినీ ప్రియులు ఇప్పుడంతా ఓటీటీల వైపే చూస్తున్నారు. కంటెంట్ ఉంటే చాలు అభిమానులు ఆదరిస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగానే ఓటీటీలు  సైతం సరికొత్త కంటెంట్‌ను అందిస్తున్నాయి. అలా మరో యూత్‌ఫుల్‌ కామెడీ సిరీస్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో తెరకెక్కించిన ఈ కామెడీ వెబ్‌సిరీస్ వేరే లెవెల్ ఆఫీస్.. ఒక్కొక్కరు ఒక్కో ఆణిముత్యం అనేది ఉపశీర్షిక.

బిగ్‌బాస్‌ రన్నరప్‌ అఖిల్‌ లీడ్‌ రోల్‌లో ఈ వెబ్ సిరీస్‌ తెరకెక్కించారు. తెలుగు రియాలిటీ బిగ్‌బాస్‌లో రెండు సార్లు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ సీజ‌న్ 4తో పాటు బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లో అత‌డికి టైటిల్ చేజారింది. బిగ్‌బాస్‌తో ఫేమ్ తెచ్చుకున్నప్పటికీ అఖిల్‌కు పెద్ద‌గా సినిమా అవ‌కాశాలు మాత్రం రాలేదు.

తాజాగా వేరే లెవెల్ ఆఫీస్ అంటూ ఈ సరికొత్త వెబ్ సిరీస్‌తో  ప్రేక్షకుల ముందుకొస్తున్నారు అఖిల్. ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ నెల 28 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ వెబ్‌సిరీస్‌లో అఖిల్ సార్ధ‌క్‌, మ‌హేష్ విట్టాతో పాటు ప‌లువురు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్, యూట్యూబ్ స్టార్స్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. దాదాపు 50కి పైగా ఎపిసోడ్స్‌తో ఈ వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

త‌మిళ రీమేక్‌గా వేరే లెవెల్ ఆఫీస్..

త‌మిళంలో విజ‌య‌వంత‌మైన వేర మారి ఆఫీస్‌కు రీమేక్‌గా ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్కించారు. ప్ర‌స్తుతం ఈ సిరీస్ సీజ‌న్- 2 ఆహా త‌మిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సీజ‌న్-1 యూత్‌ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. సాఫ్ట్‌వేర్‌ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీవితం ఆధారంగా ఈ సిరీస్‌ను రూపొందించినట్లు పోస్టర్‌ చూస్తేనే అర్థమవుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement