
తెలుగు బుల్లితెర ప్రియుల్లో అత్యంత క్రేజ్ ఉన్న రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-9 గ్రాండ్గా ప్రారంభమైంది. ఈనెల 7న 15 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఈ సారి భిన్నంగా కామన్ కేటగిరీ నుంచి ఏకంగా ఆరుగురిని పంపించారు. ఈ సీజన్లో బిగ్బాస్లో తొమ్మిది మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్గా అడుగుపెట్టారు. అయితే ప్రారంభమైన మూడు రోజులకే నామినేషన్స్తో హౌస్ను హీటెక్కించారు బిగ్బాస్. తొలివారంలో ఏకంగా తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్లలో రీతూ చౌదరి, సుమన్ శెట్టి, ఫ్లోరా సైనీ, సంజన గల్రానీ, శ్రష్ఠి వర్మ, రాము రాథోడ్, తనూజ, ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ ఉన్నారు.
అయితే తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను బిగ్బాస్ మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈరోజు జరిగే ఎపిసోడ్లో కేవలం గుడ్డు కోసం హౌస్ సభ్యులంతా గొడవకు దిగారు. ఎవరు గుడ్డు తిన్నారు అంటూ హౌస్మేట్స్ను ప్రశ్నించగా.. నేనైతే తినలేదండి.. ప్రామిస్ అంటూ సంజనా గల్రానీ అన్నారు. నీవల్లే అందరికీ ప్రాబ్లం అంటూ సంజనాతో భరణి వాదించారు. దీంతో భరణిపై మాస్క్ మ్యాన్ హరీశ్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. మీరు టాపిక్ను డైవర్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేను మీకంటే బాగా చేస్తానని మాస్క్ మ్యాన్ అన్నారు. దీంతో భరణికి, హరీశ్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. హౌస్మేట్స్ అంతా వీరిద్దరికీ నచ్చజెప్పేందుకు ప్రయత్నించిన ప్రోమో ఎపిసోడ్పై మరింత ఆసక్తిని పెంచేసింది. ఇంకెందుకు ఆలస్యం బిగ్బాస్ ప్రోమో చూసేయండి.
Guddu Poyindhi!🥚😬Tenants are banned from the House🚫🏠
Watch #BiggBossTelugu9 Mon–Fri 9:30 PM, Sat & Sun 9 PM on #StarMaa & stream 24/7 on #JioHotstar#BiggBossTelugu9 #StreamingNow pic.twitter.com/9FdoevSKDG— JioHotstar Telugu (@JioHotstarTel_) September 10, 2025