Tamannaah Assets: నటిగా తమన్నా ఎన్ని కోట్లు వెనకేసిందో తెలుసా?

Tamannaah Net Worth: Remuneration And Assets Goes Viral - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. న్యూ ఇయర్‌ ఈవెంట్‌లో నటుడు విజయ​ వర్మను హగ్‌ చేసుకుని ముద్దు పెట్టిన వీడియో బయటకు వచ్చింది. స్టార్‌ హీరోయిన్‌ అయినప్పటికీ సింగిల్‌గా ఉంటూ ఇప్పటివరకు రూమర్లకు దూరంగా ఉన్న తమన్నా తాజాగా విజయ్‌ వర్మతో డేటింగ్‌ గాసిప్స్‌తో వార్తల్లోకెక్కింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి తమన్నాపై పడింది. ఈ వార్తల్లో నిజమెంతుంది, తమన్నా నిజంగానే విజయ్‌ వర్మతో రిలేషన్‌లో ఉందా? అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్‌ ఆరా తీస్తున్నారు.

ఈ క్రమంలో తమన్నాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం చర్చనీయాంశమైంది. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటిగా ఆమె సంపాదించిన ఆస్తుల వివరాలు బయటకు వచ్చాయి. దశాబ్ద కాలంపైనే సినీ రంగంలో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఆమె 2007లో హ్యాపీడేస్‌ మూవీతో తొలి సక్సెస్‌ను అందుకుంది. ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. ఇటివల ముంబైలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ కొనుగోలు చేసిందట. దానికి విలువ దాదాపు రూ. 16 కోట్లు ఉంటుందని సమాచారం. ఇప్పటికే ఆమె పలు వాణిజ్య ప్రకటనలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన విషయం తెలిసిందే.

పలు శారీ షోరూంలతో పాటు ఫాంటా, ఫ్రూటీ, సెల్కాన్‌ వంటి పలు బ్రాండ్‌లకు ఆమె ప్రచారం చేస్తుంది. ఈ ప్రకటనల ద్వారా ఆమె ఏడాది మొత్తం రూ. 12 కోట్లు అర్జీస్తుందట. ఈ లెక్కన నెలకు తమన్నా ఒక కోటి సంపాదిస్తుందన్నమాట. ఇలా ఇప్పటి వరకు తమన్నా సంపాదించిన మొత్తం ఆస్తి విలువ రూ. 110 కోట్లుపైనే ఉంటుందని సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ఆమె ఒక్క చిత్రానికి రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు పారితోషికం అందుకుంటుంది. ఇక స్పెషల్‌ సాంగ్స్‌కు అయితే రూ. 50 లక్షలు నుంచి కోటి వరకు డిమాండ్‌ చేస్తుందట. ఇదిలా ఉంటే తమన్నా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది.

2015లో వైట్ అండ్ గోల్డ్ పేరిట ఒక డైమండ్‌ జువెల్లరి బ్రాండ్‌ను ప్రారంభించింది. అలాగే తమన్నా వద్ద రూ. 2 కోట్లు విలువ చేసిన అరుదైన వజ్రం ఉందట. దానిని మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కొణిదెల సైరా నరసింహా రెడ్డి మూవీ సమయంలో తమన్నాకు బహుమతిగా ఇచ్చింది. అది ప్రపంచంలోనే 5వ అతి పెద్ద డైమండ్ అని వినికిడి. దీని బరువు సుమారుగా 62.4 గ్రాములు ఉంటుందట. వీటితో పాటు ఆమె గ్యారేజిలో విలువైన కార్ల కలెక్షన్స్‌ కూడా ఉన్నాయట. అందులో లాండ్ రోవర్ డిస్కవరీ, బీఎమ్‌డబ్య్లూ 5 సిరీస్, బెంజ్ కార్లు ఉన్నాయి. ఇక తమన్నా వాడే హ్యాండ్‌ బ్యాగ్‌ ఖరీదు రూ. 3 లక్షలు పైచిలుకు ఉంటుందని తెలుస్తోంది. ఇలా తమన్నా భారీగానే ఆస్తులు వెనకేసుకుంది.  

చదవండి:
నేను కోరుకుంది ఇదే.. చాలా సంతోషంగా ఉంది: తమన్నా
వీడియోతో ట్రోలర్స్‌ నోరు మూయించిన హీరోయిన్‌

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top