రష్మీ: ది రాకెట్‌.. మూడు రకాల లుక్స్‌లో తాప్సీ! | Taapsee Rashmi Rocket Movie Updates | Sakshi
Sakshi News home page

రష్మీ: ది రాకెట్‌.. మూడు రకాల లుక్స్‌లో తాప్సీ!

Published Mon, May 17 2021 1:52 AM | Last Updated on Mon, May 17 2021 8:59 AM

Taapsee Rashmi Rocket Movie Updates - Sakshi

క్రీడల నేపథ్యంలో సాగే చిత్రాలు చేస్తూ తాప్సీ దూసుకెళుతున్నారు. ‘సూర్మ’ చిత్రంలో హాకీ ప్లేయర్‌గా, ‘సాండ్‌ కీ ఆంఖ్‌’లో షూటర్‌గా ఈ బ్యూటీ కనిపించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ‘రష్మీ: ది రాకెట్‌’ చిత్రం కోసం అథ్లెట్‌గా (రన్నర్‌), ‘శభాష్‌ మిథు’ (క్రికెట్‌ క్రీడాకారణి మిథాలీరాజ్‌ బయోపిక్‌) సినిమా కోసం క్రికెటర్‌గా మారారు తాప్సీ. ‘రష్మీ: ది రాకెట్‌’ సినిమా షూటింగ్‌ను ఇటీవలే పూర్తి చేశారు. ఈ చిత్రంలో తాప్సీ మూడు రకాల లుక్స్‌లో కనిపించనున్నారు.

ఓ మారుమూల గ్రామానికి చెందిన యువతిగా, ఆ తర్వాత అథ్లెట్‌గా నేషనల్‌కు సెలెక్ట్‌ అయిన క్రీడాకారిణిగా, అంతర్జాతీయ వేదికలపై జరిగే పోటీల్లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారిణిగా.. ఇలా మూడు లుక్స్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు తాప్సీ. ఈ లుక్స్‌ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది కాస్ట్యూమ్‌ టీమ్‌. ఈ మూడు లుక్స్‌ తాప్సీ అభిమానులకు త్రిబుల్‌ ధమాకా అని చెప్పొచ్చు. ‘శభాష్‌ మిథు’ త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ‘రన్‌ లోలా రన్‌’, ‘దోబార’, తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓ సినిమా.. ఇలా తాప్సీ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇటీవల ఈ సినిమాల చిత్రీకరణల్లో భాగంగా రోజుకి 18 గంటలు పని చేశారట తాప్సీ. అంకితభావానికి చిరునామా తాప్సీ అని ఆయా చిత్రబృందాలు అభినందిస్తున్నాయి.

చదవండి: డైరెక్టర్‌ శంకర్‌కు లైకా సంస్థ షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement