షూటింగ్‌లో పాల్గొనడం సంతోషం | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో పాల్గొనడం సంతోషం

Published Mon, Apr 17 2023 4:31 AM

Sushmita Sen resumes Aarya 3 shoot in Jaipur - Sakshi

‘‘ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. ‘ఆర్య 3’ షూటింగ్‌ కోసం జైపూర్‌కు వచ్చాను. తిరిగి షూటింగ్స్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది’’ అంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు నటి సుష్మితాసేన్‌. ఈ ఏడాది ఫిబ్రవరిలో గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరిన సుష్మితాసేన్‌కు ఓ మేజర్‌ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి షూటింగ్స్‌కు కాస్త దూరంగా ఉంటున్న ఆమె ఇప్పుడు కోలుకుని షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

‘ఆర్య’ వెబ్‌ సిరీస్‌లోని మూడో సీజన్‌ కోసం సుష్మితాసేన్‌ ప్రస్తుతం జైపూర్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. సుష్మితాసేన్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న ‘ఆర్య 3’ వెబ్‌ సిరీస్‌కు రామ్‌మద్వానీ, సందీప్‌ మోది దర్శకత్వం వహిస్తున్నారు. డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానున్న ఈ సిరీస్‌ రిలీజ్‌ డేట్‌పై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇక సుష్మితాసేన్‌ ‘తాలి’ అనే మరో వెబ్‌సిరీస్‌లో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఇందులో తన పాత్ర డబ్బింగ్‌ని గత నెలలో పూర్తి చేశారామె.

Advertisement
 
Advertisement