మహేష్ బాబు , రాజమౌళి (SS Rajamouli) సినిమా SSMB29 ఈవెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. #GlobeTrotter పేరుతో నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఈవెంట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.. అయితే, కార్యక్రమానికి సంబంధించిన పాస్లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలని ఒక వీడియోతో రాజమౌళి పంచుకున్నారు. పాస్‌పోర్ట్ మాదిరిగా ఉన్న ఈ పాస్‌లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్ మూవీ లవర్స్‌కి సుదర్శన్ థియేటర్ అంటే పరిచయం అక్కర్లేదు.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న ఈ థియేట్ మహేష్ అభిమానులకు ఓ ఎమోషనల్, సెంటిమెంట్ అని చెప్పాలి. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఇక్కడ భారీ కటౌట్లతో పాటు వందల కొద్ది ఫెక్సీలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇదే థియేటర్ వద్ద ఆయన అభిమానులు #GlobeTrotter ఈవెంట్ పాస్‌లను చూపుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

త్రిశూలం బొమ్మతో ముద్రించిన ఈ పాస్లు పాస్‌పోర్ట్ మాదిరిగా ఉండటంతో సరికొత్తగా ఉందంటూ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ఫస్ట్ పేజీలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక, పృథ్వీరాజ్, రాజమౌళి ఫొటోలను ముద్రించారు. ఆపై కార్యక్రమంలో పాల్గొనేవారు పాటించాల్సిన రూల్స్, మ్యాప్‌తో సహా ఇచ్చారు. పాస్లు ఉన్నవారు మాత్రమే వేదిక వద్దకు చేరుకోవాలని ఇప్పటికే రాజమౌళి పేర్కొన్నారు. ఎట్టిపరిస్థితిల్లోనూ చిన్నపిల్లలు, సీనియర్ సిటిజన్లకు అనుమతి లేదని తెలిపారు. ఇంటి వద్దే జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడాలని కోరారు.
Here it is #GlobeTrotter event passes overview at our SSMB Fort
Please follow the given Instructions in the pass and enjoy the #GlobeTrotter event at RFC 📍
Make the event grand success on noveMBer 15th
Enjoy the event & Be Safe 🙏#SSMB29 || #MaheshBabu𓃵 pic.twitter.com/vgzLggcQxD— Sudarshan35mm'MB'FC (@sudarshan35mm) November 13, 2025
Passport #GlobeTrotter 🔥🔥🔥🔥
What an innovative promotion by team 👏🏻@ssrajamouli 🔥 pic.twitter.com/Y7ttggs7tk— Thyview (@Thyview) November 13, 2025


