SSMB 28: స్పెషల్‌ సాంగ్‌లో రష్మిక.. పారితోషికం అన్ని కోట్లా?

SSMB28: Rashmika Mandanna Demands Huge Remuneration For Special song - Sakshi

స్టార్‌ హీరోయిన్స్‌ స్పెషల్‌ సాంగ్‌ చేస్తే.. ఆ కిక్కే వేరేలా ఉంటుంది. సినిమాకు హైప్‌ తీసుకురావడానికి ఐటం సాంగ్‌ బాగా ఉపయోగపడుతుంది. అందుకే మన దర్శకనిర్మాతలు స్పెషల్‌ సాంగ్‌పై స్పెషల్‌ కేర్‌ తీసుకుంటారు. పెద్ద మొత్తంలో పారితోషికం చెల్లించి స్టార్‌ హీరోయిన్లను ఒప్పిస్తారు. ఇప్పటికే  జనతా గ్యారేజ్ లో కాజల్, పుష్పలో సమంత, గనిలో తమన్నా,ఆచార్యలో రెజీనా స్పెషల్ సాంగ్స్ తో మెరుపులు మెరిపించారు. ఇప్పుడు నేషన్ క్రష్ రష్మిక వంతు వచ్చింది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మందన్నా ఓ స్పెషల్‌ సాంగ్‌ చేయనుందట. దీని కోసం రష్మిక భారీగా డిమాండ్‌ చేస్తోందట. స్పెషల్‌ సాంగ్‌లో స్టెప్పులేయాలంటే రూ.4 కోట్ల పారితోషికంగా ఇవ్వాలని రష్మిక అడిగిందట.

రష్మిక రెమ్యునరేషన్‌ టాపిక్‌ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ప్రస్తుతం రష్మిక హిందీలో రెండు సినిమాలతో పాటు  తెలుగులో అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2'లోనూ, తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న 'వారసుడు' మూవీలోనూ నటిస్తోంది.

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top