
బాలీవుడ్‌లో పలు చిత్రాలు, వాణిజ్య ప్రకటనలను రూపొందించిన శ్రీ నిధి ఆర్ట్స్ అధినేతలు ఎం.జె.రమణన్, జానీ దుగల్, వినంబర శాస్త్రి తాజాగా తమిళం, తెలుగు భాషలలో ఓ వినోద భరిత చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.జె.రమణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుష్యంత్, వివేక్ ప్రసన్న, తెలుగు నటుడు శ్రీనివాస్‌రెడ్డి, హిందీ నటుడు రవి కిషన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ జూన్‌లో ఆరంభించనున్నట్లు తెలిపారు. ఎస్‌ఆర్ సతీష్ కుమార్ ఛాయాగ్రహణం, అంజాద్ నదీమ్ అమీర్ సంగీతం అందిస్తున్నారు.