Squid Game 2: సరికొత్తగా రానున్న 'స్క్విడ్ గేమ్ 2'.. మరబొమ్మకు బాయ్‌ఫ్రెండ్ అట..

Squid Game Season 2 Official Announcement And Doll Has Boyfriend: ప్రముఖ కొరియన్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' వినడానికి చిన్న పిల్లల ఆటల ఉన్నా చూసే ఆడియెన్స్‌ను ప్రతిక్షణం థ్రిల్లింగ్‌కు గురిచేసింది. సెప్టెంబర్ 17, 2021న ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై నెంబర్ వన్ సిరీస్‌గా నెట్‌ఫ్లిక్స్ చరిత్రలోనే రికార్డు సాధించింది. రిలీజైన 28 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 11 కోట్ల మంది నెట్‌ఫ్లిక్స్ యూజర్లు చూశారు. కొరియన్ భాషలో విడుదలైన ఈ వెబ్ సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు సుమారు 900 మిలియన్ డాలర్లు లాభం వచ్చినట్లు సమాచారం. మొత్తం 8 గంటల 12 నిమిషాలు ఉండే ఈ సిరీస్‌లో 9 ఎపిసోడ్‌లు ఉన్నాయి.
అయితే ఇప్పుడు ఈ సిరీస్‌కు రెండో సీజన్ వస్తున్నట్లుగా డైరెక్టర్ హ్వాంగ్ డాంగ్ హ్యూక్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో రౌండ్స్ మరింత కొత్తగా, ప్రతిక్షణం ఉత్కంఠకు గురిచేసేలా ఉండన్నున్నట్లు తెలిపారు. 'గతేడాది స్క్విడ్ గేమ్‌కు ప్రాణం పోసి ఓ సిరీస్ రూపంలో ఒకటో సీజన్‌గా తీసుకురావడానికి 12 ఏళ్లు పట్టింది. కానీ మోస్ట్ పాపులర్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా అవతరించేందుకు 12 రోజులు మాత్రమే పట్టింది. స్క్విడ్ గేమ్‌ను ఇంతగా ఆదరించి ఘన విజయాన్ని అందించిన వరల్డ్‌వైడ్‌గా ఉన్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక ఇప్పుడు జీ-హన్ రిటర్న్స్.. ది ఫ్రంట్ మ్యాన్ రిటర్న్స్.. సీజన్-2 వచ్చేస్తోంది. ఆ సూట్ ధరించి మేమ్ ప్రారంభించేందుకు డీడాగ్జి మళ్లీ తిరిగి రావొచ్చు. ఈసారి యంగ్ హీ (మరబొమ్మ)కి బాయ్‌ఫ్రెండ్‌గా 'కియోల్-సు' రానున్నాడు.' అని డైరెక్టర్ తెలిపారు.
Hwang Dong-Hyuk writer, director, producer, and creator of @squidgame has a message for the fans: pic.twitter.com/DxF0AS5tMM
— Netflix (@netflix) June 12, 2022
అయితే ఇందులో ఉన్న మరబొమ్మ (రోబోట్)కు బాయ్‌ఫ్రెండ్ ఉండటం అనే విషయంపై నెటిజన్స్ ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. 'ఈ బొమ్మకు (రోబోట్) కూడా బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా ? నమ్మలేకపోతున్నాను. నేను ఇంకా సింగిల్‌గానే ఉన్నా' అంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రెండో సీజన్ ఎప్పుడు వస్తుందనేది ఇంకా వెల్లడించలేదు.
Red light… GREENLIGHT!
Squid Game is officially coming back for Season 2! pic.twitter.com/4usO2Zld39
— Netflix (@netflix) June 12, 2022
how come the doll in squid game has a boyfriend but im single https://t.co/ST4RFRhv77
— xin 🌱 FL!P that (@nagumowife) June 12, 2022
the squid games doll has a boyfriend & some of you guys are still single lol just saying https://t.co/gzJg971Swa
— brooke (@brookeab) June 12, 2022
now??? imagine the squid game robot got a boo and ur still single 😭 https://t.co/jlA69DdFDc
— jimin connoisseur ⁷ (@sunflowrmemory) June 12, 2022
Girlie got a boyfriend~ 💃🏽 pic.twitter.com/BNsyn4dGv7
— shera || (@ddiddirere) June 12, 2022
మరిన్ని వార్తలు