ప్రముఖ సింగర్‌ హరిణి తండ్రి అనుమానాస్పద మృతి.. కుటుంబం అదృశ్యం!

Singer Harini Family Goes Missing, Father Found Suspicious Death - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నేపథ్య గాయని హరిణి కుటుంబం అదృశ్యమైంది. వారం రోజుల నుంచి హరిణి  కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారు. వారం నుంచి వారందరి మొబైల్స్‌ కూడా స్విచ్చాఫ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలో అనుమానస్పద స్థితిలో హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం లభ్యమైంది. బెంగళూరులోని రైల్వేట్రాక్‌పై ఆయన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

ఏకే రావు మృతిపై  బెంగళూరు పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు ఏకే రావు శరీరంపై కత్తి గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఆయన సుజనా ఫౌండేషన్‌ సీఈఓగా, సుజనా గ్రూప్స్ లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలో ఏకే రావు ఫ్యామిలీతో నివాసముంటున్నారు. 
చదవండి: ప్రియాంక తన భర్త పేరు అందుకే తొలగించిందట!

ఈ నెల 8న ఆయన హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు చివరిసారిగా ఈ నెల 19న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. 23 న ఏకే రావు మృతి చెందినట్లు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బెంగుళూరులోనే మృతుడి అంతక్రియలు పూర్తి చేశారు.
 

మృతుడి శరీరంపై కత్తిగాట్లు ఉండటంతో హత్య కోణంలో బెంగుళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణంగా భావిస్తున్నారు. ఏకేరావును హతమార్చి మృతదేహాన్ని ట్రాక్‌పై పడేసి ఉండొచ్చిని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హరిణి కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియాల్సి ఉంది. హరిణి ఓ ఇండియన్‌ ప్లేబ్యాక్ సింగర్‌. ఆమె గాయని మాత్రమే కాదు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, క్లాసికల్‌ డ్యాన్సర్‌ కూడా. తమిళం, తెలుగు, కన్నడ, మాళయాలం, హిందీ సినిమాల్లో చాలా పాటలు పాడారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top