వీడియో షేర్‌ చేసిన శ్వేతా బసు ప్రసాద్‌, అప్పటికీ, ఇప్పటికీ అదే అందం.. | Shweta Basu Prasad Shares Interesting Video | Sakshi
Sakshi News home page

Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్‌లో ఈ టాలెంట్‌ కూడా ఉందా! వీడియో వైరల్‌

Jun 28 2023 2:52 PM | Updated on Jun 28 2023 3:33 PM

Shweta Basu Prasad Shares Interesting Video - Sakshi

షూటింగ్‌ కోసం లొకేషన్‌కు వెళ్లడానికి ముందు అంటే సుమారుగా 6.45 గంటల ప్రాంతంలో ఈ కచేరీ జరిగింది అని

ఎ..క..డ.., ఎ..పు..డు.. ఇలా దీర్ఘాలు తీస్తూ మాట్లాడుతూ.. ముద్దుముద్దు మాటలతో ఫేమస్‌ అయింది శ్వేతా బసు ప్రసాద్‌. తన నవ్వుతో, యాక్టింగ్‌తో యూత్‌ ఫేవరెట్‌ హీరోయిన్‌గా మారిన ఆమె ఆ తర్వాత మాత్రం తన ఛార్మ్‌ కోల్పోతూ వచ్చింది. కొత్త బంగారు లోకంతో స్టార్‌డమ్‌ సంపాదించిన ఈమె ఆ తర్వాత మాత్రం దాన్ని కాపాడుకోలేకపోయింది. తన హవా తగ్గిపోవడంతో ఐటం సాంగ్‌లోనూ నటించింది. ఆమె చివరగా విజేత సినిమాలో నటించింది. అనంతరం ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడే సెటిలైంది. 

తాజాగా ఆమె సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది. ఇందులో శ్వేతా బసు ప్రసాద్‌ సితార వాయించింది. 'హోటల్‌ గదిలో అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌, నా టీమ్‌ మొత్తానికి చిన్నపాటి కచేరీ చేశాను. షూటింగ్‌ కోసం లొకేషన్‌కు వెళ్లడానికి ముందు అంటే సుమారుగా 6.45 గంటల ప్రాంతంలో ఈ కచేరీ జరిగింది' అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. ఇది చూసిన నెటిజన్స్‌ 'మీలో చాలా టాలెంట్‌ దాగి ఉంది', 'అప్పటికీ, ఇప్పటికీ అదే అందం' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శ్వేతా 18 ఏళ్ల వయసులోనే సితార నేర్చుకుంది.

కాగా తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన శ్వేతా బసు ప్రసాద్‌ వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. గతంలో వ్యభిచార రాకెట్‌లో పట్టుబడినా తిరిగి నిలదొక్కుకుంది. కానీ ఈ ఘటన తన కెరీర్‌ను తీవ్రంగా దెబ్బకొట్టింది. 2018లో దర్శకుడు రోహిత్‌ మిట్టల్‌ను పెళ్లాడగా మరుసటి ఏడాదే విడాకులు ఇచ్చేసింది. ప్రస్తుతం సింగిల్‌గా ఉంటూ ఓటీటీలో తనకు నచ్చిన పాత్రలు చేసుకుంటూ పోతోంది. ఆమె ఓటీటీలో చివరగా జూబ్లీ వెబ్‌ సిరీస్‌లో కనిపించింది.

చదవండి: సలార్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement