ఆ సంఘటనతో బాడీగార్డ్‌ కావాలని అనుకున్నా: శృతిహాసన్‌ | Shruti Haasan To Hire Bodyguard After Incident In Mumbai Airport, Deets Inside - Sakshi
Sakshi News home page

Shruti Haasan On Airport Incident: ఆ సంఘటనతో బాడీగార్డ్‌ కావాలని అనుకున్నా

Sep 25 2023 6:58 AM | Updated on Sep 25 2023 8:55 AM

Shruti Haasan Fear In Airport - Sakshi

సెలబ్రిటీలకు ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి అభిమానుల బెడద, ఇంకోసారి అపరిచితుల భయం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నటి శృతిహాసన్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు ఆమె చాలా బోల్డ్‌ అండ్‌ బ్యూటీ అన్న విషయం తెలిసిందే. మాటల్లోనే కాదు చేతల్లోనూ శ్రుతిహాసన్‌ ఫెయిర్‌గా ఉంటారు . అలాంటి శ్రుతిహాసనే భయపడే పరిస్థితిని ఎదుర్కొన్నారు.

ప్రభాస్‌ సరసన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌ చిత్రంలో నటిస్తున్న శ్రుతిహాసన్‌ ఇటీవల ముంబై విమానాశ్రయంలో ఒక చేదు అనుభవాన్ని చవి చూశారు. దీని గురించి ఆమె ట్విట్టర్లో పేర్కొంటూ.. నడుచుకుంటూ వస్తుండగా ఓ వ్యక్తి నా వెనకే రావడం గమనించాను. అయితే అతను తనను సమీపించడంతో తొలుత అభిమాని అయ్యి ఉంటాడని భావించానన్నారు. అయితే తాను కారు ఎక్కే వరకు వెనుక రావడంతో కొంత భయమేసింది.

అయితే ధైర్యంగా ఎవరు నువ్వు అని అడిగాను అన్నారు. దీంతో అతను తడబడుతూ వెళ్లిపోయాడని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎవరినీ బాడీగార్డ్‌గా పెట్టుకోలేదన్నారు. స్వేచ్ఛగా జీవించాలని కోరుకుంటున్నానని.. అందుకే ఇప్పటివరకు ఎవరినీ బాడీగార్డ్‌గా నియమించుకోలేదన్నారు. ఈ సంఘటన తర్వాత బాడీగార్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన కలుగుతోందని శ్రుతి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement