'ఐ యామ్ నాట్ జెట్లీ..' బోల్డ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్‌ | Satya Latest Movie JetLee SATYA IS NOT JETLEE Full Video Song | Sakshi
Sakshi News home page

JETLEE Full Video Song: 'ఐ యామ్ నాట్ జెట్లీ..' సత్య ఫుల్ బోల్డ్ సాంగ్ రిలీజ్‌

Apr 3 2026 2:19 PM | Updated on Apr 3 2026 2:37 PM

Satya Latest Movie JetLee SATYA IS NOT JETLEE Full Video Song

'మత్తు వదలరా' సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు రితేశ్ రానా.. కమెడియన్ సత్యని హీరోగా  ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాకు 'జెట్లీ' అనే టైటిల్ ఖరారు చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్ గ్లింప్స్, పోస్టర్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. సత్య ఈజ్ నాట్ జెట్లీ అంటూ సాగే పుల్ మాస్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు సాయి సోమయాజులు లిరిక్స్ అందించగా..శ్రావణ భార్గవి ఆలపించారు. ఈ పాటకు కాల భైరవ సంగీతమందించారు. కాగా.. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, రియా సింఘా, అజయ్  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement