
సప్తగిరి, ప్రియాంకశర్మ జంటగా నటించిన చిత్రం పెళ్లికాని ప్రసాద్. ఈ ఏడాది మార్చి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకత్వం వహించారు. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉన్న ఈ చిత్రం.. ఈ రోజు నుంచి మరో ఓటీటీకి వచ్చేసింది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం పెళ్లి కాని ప్రసాద్ సినిమాను చూసి ఓటీటీలో ఎంజాయ్ చేయండి. ఈ మూవీని కె.వై.బాబు, భానుప్రకాశ్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల సంయుక్తంగా నిర్మించారు. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు వినోదం అందించనుంది.
‘పెళ్లికాని ప్రసాద్’ కథేంటంటే..?
ప్రసాద్(సప్తగిరి) కి 38 ఏళ్లు. మలేషియాలో మంచి ఉద్యోగం.. భారీ జీతం. అయినా ఆయనకి పెళ్లి కాదు. దానికి ఒక కారణం వాళ్ళ నాన్నే(మురళీధర్). రెండు కోట్ల కట్నం ఇచ్చే అమ్మాయినే చేసుకోవాలని కండిషన్ పెడతాడు. చివరకు ఓ సంబంధం సెట్ అయి ప్రసాద్ ఇండియాకు తిరిగి వస్తాడు. అయితే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది. కట్ చేస్తే... ప్రియా(ప్రియాంక శర్మ) ఎప్పటికైనా పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ కావాలనుకుంటుంది. ఆమెతోపాటు అమ్మ నాన్న లను, బామ్మను కూడా విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటుంది.
ప్రియ ఫ్యామిలీ మొత్తం ఓ ఎన్నారై సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రసాద్ గురించి తెలిసి.. ఫ్యామిలీ మొత్తం డ్రాప్ చేసి పెళ్లి చేయిస్తారు. పెళ్లి తర్వాత ప్రసాద్ ఇండియాలోనే ఉండాలనుకుంటాడు. ఈ విషయం ప్రియకి తెలిసిన తర్వాత ఏం జరిగింది? అసలు ప్రసాద్ పెళ్లి తరువాత ఇండియాలోనే ఎందుకు ఉండాలనుకున్నాడు? పెళ్లి తర్వాత ప్రసాద్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? విదేశాలకు వెళ్లాలనుకున్న ప్రియ ఫ్యామిలీ కోరిక నెరవేరిందా? లేదా? అనేదే తెలియాలంటే సినిమా చూడాల్సిందే.