
‘ఒకప్పటి సాధారణ క్షణాలన్నీ జ్ఞాపకాలుగా మారడమే జీవితం..’ అనే క్యాప్షన్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం టీజర్ చివర్లో కనిపిస్తుంది. సంతోష్ శోభన్, మానసా వారణాసి జంటగా నటిస్తున్న చిత్రం ఇది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తోంది. ఈ సినిమా టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు.
రొమాంటిక్ లవ్‌స్టోరీ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో విడుదలకు సిద్ధమవుతోంది. నెల్లూరుకు చెందిన శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ చేసి, సరైన ఉద్యోగం లేక చెన్నై నగరంలో ఇబ్బందులు పడుతుంటాడు. ఖర్చుల కోసం బైక్ పూలింగ్ చేస్తుంటాడు. ప్రీతి (మానస వారణాసి) శివ బైక్ పై జర్నీ చేస్తుంది. అపరిచితులుగా కలిసిన శివ, ప్రీతి ప్రేమికులుగా మారడం వంటివి టీజర్‌లో ఆవిష్కరించారు. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్, కో ప్రోడ్యూసర్: అజయ్ కుమార్ రాజు .పి.