ఇక నటనపైనే ఫోకస్‌: శాండీ | Sandy Master About Kishkindhapuri Movie | Sakshi
Sakshi News home page

ఇక నటనపైనే ఫోకస్‌: శాండీ

Sep 17 2025 3:37 AM | Updated on Sep 17 2025 3:37 AM

Sandy Master About Kishkindhapuri Movie

‘‘లియో, లోక, కిష్కింధపురి’... ఇలా వరుసగా నేను నటించిన చిత్రాలు హిట్‌ అయినందుకు హ్యాపీగా ఉంది. నా చిన్నప్పుడు అందరూ నా కళ్లను చూసి, ‘డెత్‌ గోట్‌ ఐస్‌’ అని ఆటపట్టించేవారు. ఆ కళ్లు నచ్చే ‘లియో’కు లోకేశ్‌గారు నన్ను నటుడిగా ఎంపిక చేసుకున్నారు’’ అన్నారు కొరియోగ్రాఫర్‌–యాక్టర్‌ శాండీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా, శాండీ మాస్టర్‌ విలన్‌గా నటించిన చిత్రం ‘కిష్కింధపురి’. కౌశిక్‌ పెగల్లపాటి దర్శకత్వంలో సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. 

ఈ సందర్భంగా శాండీ మాస్టర్‌ మాట్లాడుతూ– ‘‘కిష్కింధపురి’ సినిమా కోసం లుక్‌ టెస్ట్‌ చేసి, ఫైనల్‌గా దివ్యాంగుడు లుక్‌ను ఓకే చేశాం. ఓ సీన్‌లో డమ్మీ సిలిండర్‌తో హీరో నన్ను కొట్టాలి. కానీ అనుకోకుండా నిజమైన సిలిండర్‌తో కొట్టడంతో నా తలకు దెబ్బతగిలింది.

ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌ తీశారు. ఇప్పుడు బాగానే ఉంది. ఇక ‘కూలీ’లోని ‘మోనికా..పాట, ‘విక్రమ్‌’లోని పాతల...పాతల’, ‘ఓజీ’ సినిమాలోని ఓ ప్రమోషనల్‌ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేశాను. ఇప్పుడు నా ఫోకస్‌ అంతా యాక్టింగ్‌పైనే. ప్రస్తుతంపా. రంజిత్‌ నిర్మాణంలో హీరోగా ఓ సినిమా, మలయాళ ‘కథనార్‌’లో విలన్‌ రోల్‌ చేస్తున్నాను’’ అని చెప్పారు. 

‘కిష్కింధపురిని’ అందరూ చూడాలి: చిరంజీవి     ‘కిష్కింధపురి’ని హీరో చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించి, ఓ వీడియో విడుదల చేశారు. ‘‘నా రాబోయే చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌గారు’ నిర్మాత సాహు గారపాటిగారు నిర్మించిన ‘కిష్కింధపురి’ మంచి విజయాన్ని సాధించింది. హారర్‌ సినిమాలంటే భయాన్ని ఎలివేట్‌ చేస్తూ దెయ్యం కథ చెబుతుంటారు. కానీ, ఈ సినిమాలో హారర్‌తోపాటు మంచి సైకలాజికల్‌పాయింట్‌ని యాడ్‌ చేసి చెప్పడం చాలా బాగుంది. శారీరక వైకల్యం కంటే మానసిక వైకల్యం ప్రమాదకరమని చెప్పారు డైరెక్టర్‌ కౌశిక్‌. ఈ సినిమా ద్వారా సాయి శ్రీనివాస్, అనుపమ మంచి హిట్‌ని తమ ఖాతాలో వేసుకున్నారు. చేతన్‌ మ్యూజిక్‌ బాగుంది. ఈ సినిమాని అందరూ చూడాల్సిన అవసరం ఉంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement