Samantha: ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన సామ్.. షాక్‌లో ఫ్యాన్స్

హీరోయిన్ సమంత అంటే దక్షిణాది చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే యశోద చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో పలువురి ప్రశంసలు కూడా అందుకుంది. అయితే అదే సమయంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొద్దిరోజులు విరామం తీసుకుంది. ఆ తర్వాత ఎక్కడా కూడా సమంత బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆమె ఆరోగ్యంపై పలు రకాల వదంతులు కూడా వచ్చాయి.
వీటన్నింటికీ చెక్ పెడుతూ ముంబయి ఎయిర్ పోర్ట్‌లో ప్రత్యక్షమై కనిపించింది భామ. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్నాక బయట కనిపించడం ఇదే మొదటిసారి. వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ముంబయి ఇవాళ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. దీంతో అభిమానులు సామ్ ఈజ్ బ్యాక్ అని కామెంట్లు పెడుతున్నారు. కాకపోతే సమంతని చూసి చాలా మంది షాకవుతున్నారు. ఏంటీ ఇలా మారిపోయిందని షాకవుతున్నారు. మరికొందరేమో ఆమె ఆత్మ విశ్వాసానికి సెల్యూట్ అంటూ పోస్ట్ చేస్తున్నారు.
సినిమాల విషయానికొస్తే.. ‘ద ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ ప్రతినాయక పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత సామ్ నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘యశోద’లో తన నటనతో అదరగొట్టింది. తాజాగా ‘శాకుంతలం’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది సమంత.
The Most Powerful Lady I Have Ever Seen🖤
All are seeing @Samanthaprabhu2 Just Walking
All I can See is her CONFIDENCE,
Battling with the hardest obstacles,
Hiding her Pain behind the glasses with that never giveup attitude🔥Boss Woman 👑 #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/J0uX8zaxTl
— Sai Sunil Reddy (@SaiSunil452) January 6, 2023