అవీ మాత్రమే ప్రపంచాన్ని మార్చగలవు: సమంత పోస్ట్ వైరల్! | Samantha Participated At Pre School in Jubilee Hills Hyderabad | Sakshi
Sakshi News home page

Samantha: వాటితోనే ప్రపంచాన్ని మార్చగలం: సమంత పోస్ట్ వైరల్!

Dec 7 2023 5:48 PM | Updated on Dec 7 2023 6:48 PM

Samantha Participated At Pre School in Jubilee Hills Hyderabad - Sakshi

స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే ఖుషి సినిమాతో ప్రేక్షకులను పలరించింది. విజయ్ దేవరకొండ, సమంత నటించిన ఖుషి మిక్స్‌డ్‌ టాక్‌ను తెచ్చుకుంది. ఆ తర్వాత మయోసైటిస్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లి వచ్చింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం సినిమాలకు విరామం ప్రకటించిన సమంత ఆధ్యాత్మిక యాత్రలతో బిజీగా ఉంటోంది. అంతే కాకుండా సేవలోనూ దూసుకెళ్తోంది. అయితే  కొన్నేళ్ల క్రితమే ప్రత్యూష సపోర్ట్‌  అనే స్వచ్చంద సేవా సంస్థ ఏర్పాటు చేసి చిన్నారులకు వైద్యసేవలు అందిస్తోన్న సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: నా అభిమాన హీరో ఆయనే.. సమంత పోస్ట్ వైరల్!)

అయితే తాజాగా ఓ చిన్నపిల్లల స్కూల్‌లో కనిపించారు సమంత. వారితో కలిసి సరదాగా ముచ్చటించారు. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాలో పంచుకున్నారు.అయితే సామ్ జూబ్లీహిల్స్‌లోనే ఓ ప్రీ స్కూల్‌లో నిర్వహించిన స్పోర్ట్స్‌ డే సెలబ్రేషన్స్‌లో పాల్గొనట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పాఠశాల పిల్లలతో ఉన్న ఫోటోలను పంచుకుంది. ఒక పుస్తకం, ఒక పెన్ను, ఒక పిల్లాడు, ఒక టీచర్ మాత్రమే ఈ  ప్రపంచాన్ని మార్చగలరంటూ పోస్ట్ చేసింది.  ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement