Samantha: సమంత కొత్త లుక్ చూశారా.. ‘సామ్ ఈజ్ బ్యాక్’

సమంత ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్. ఇటీవల మయోసైటిస్ బారిన పడిన సామ్ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. కాలు కూడా కదపలేని స్థితిలో ఉన్న సామ్ క్రమంగా కోలుకున్నారు. ఇక రీసెంట్‌గా శాకుంతలం ట్రైలర్ ఈవెంట్‌లో సందడి చేసిన ఆమె తన చిత్రాల షూటింగ్స్‌ను మొదలు పెట్టేసింది. తాజాగా సామ్ తన వెబ్ సిరీస్ షూటింగ్ సెట్ అడుగుపెట్టినట్లు అధికారిక ప్రకటన వచ్చింది.
చదవండి: అప్పుడే ఓటీటీకి వీర సింహారెడ్డి? స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే..!
కాగా విడాకుల అనంతరం సమంత వరుసగా పలు భారీ ప్రాజెక్ట్స్‌కి సంతకం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె చేతిలో హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. అందులో ‘ఫ్యామిలీ మెన్’ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ రాజ్-డికే ‘సీటాడెల్’ ఒకటి. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సిరీస్ షూటింగ్‌లో తాజాగా సమంత పాల్గొన్నట్లు డైరెక్టర్స్ రాజ్-డీకే ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా సమంత కొత్త లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో సామ్, మోడరన్ లుక్‌లో స్టైలిష్ కాప్‌లా కనిపిస్తోంది.
చదవండి: సీనియర్ నటి ఖుష్బుకు చేదు అనుభవం
దీంతో ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ‘‘సామ్ ఈజ్ బ్యాక్’ అంటూ కొందరు.. ‘ఇంతవరకు సమంత ఇలా ఎప్పుడూ చూడలేదు’, ‘ఈ వెబ్ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా హాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ‘రుస్సో బ్రదర్స్’ నిర్మించిన ఈ వెబ్ సిరీస్‌ను సీటాడెల్ అనే ఫ్రాంచైజ్‌లో భాగంగా ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్‌గా రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తుండగా సమంత కీ రోల్ పోషించనుంది.
Super excited to team up with this powerhouse once again! Welcome @Samanthaprabhu2 to the world of Citadel!
Now filming 🎬@Varun_dvn #RussoBrothers @MenonSita @d2r_films @agbo_films @PrimeVideoIN @AmazonStudios pic.twitter.com/yuoigSDiTd— Raj & DK (@rajndk) February 1, 2023