Khushboo: ఎయిర్‌ పోర్ట్‌లో సీనియర్‌ నటి ఖుష్బుకు చేదు అనుభవం

Khushbu Sundar Fires on Air India Over Delay In Getting Wheelchair - Sakshi

సినీ, రాజకీయ రంగాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఖుష్బూ. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటారు. ఇటీవల తన కాలుకి గాయమైందని.. అయినా తన ప్రయాణం ఆగదంటూ ట్విట్టర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అన్నట్టుగానే మంగళవారం ఉదయం కుష్బూ వేరే రాష్ట్రానికి వెళ్లడానికి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఎయిర్‌ ఇండియా సంస్థపై ఆమె ఫైర్‌ అయ్యారు. అసలు విషయం ఏమిటంటే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్న కుష్బూ గాయమైన కాలితోనే మంగళవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు.

చదవండి: వేణుకి రూ. 20 కోట్ల పైగా ఆస్తులు.. కానీ నేను అద్దే ఇంట్లో ఉంటున్నా: వేణు మాధవ్‌ తల్లి

అయితే అక్కడ ఆమెకు వీల్‌చైర్‌ అందుబాటులో లేదు. దీంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన అసంతృప్తిని ట్విట్టర్‌ ద్వారా వ్యక్తం చేశారు. అందులో ఎయిర్‌ ఇండియా సంస్థకు వీల్‌చైర్‌ ఏర్పాటు చేసే స్థోమత లేదా? అంటూ ప్రశ్నించారు. అందు కోసం తాను అరగంట పాటు కాలి నొప్పితో ఎదురుచూశానన్నారు. ఆ తర్వాత వేరే విమాన సంస్థ నుంచి వీల్‌చైర్‌ తీసుకొచ్చి తనను పంపించారన్నారు. కాగా ఈ సంఘటనపై ఎయిర్‌ ఇండియా విమాన సంస్థ నిర్వాహకులు నటి కుష్బూకు క్షమాపణ తెలుపుతూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామం, ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తా’’మని పేర్కొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top