టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత అమెరికన్ సైన్స్ ఫిక్షన్ డ్రామా 'సిటాడెల్' హిందీ రీమేక్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే! ది ఫ్యామిలీ మేన్ దర్శకులు రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా సిటాడెల్ షూటింగ్‌లో సమంత పాల్గొన్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. అయితే విజయ్ దేవరకొండ ఖుషి సినిమాకు సమంత డేట్స్ ఇవ్వడం లేదంటూ గత కొద్దిరోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ నేపథ్యంలో ఓ అభిమాని ఖుషి పరిస్థితేంటి? అని అడిగాడు. దీనికి సామ్ స్పందిస్తూ.. 'విజయ్ దేవరకొండ అభిమానులకు క్షమాపణలు. ఖుషి షూటింగ్‌ను అతి త్వరలో తిరిగి ప్రారంభించనున్నాం' అంటూ గుడ్‌న్యూస్ చెప్పింది. మొత్తానికి మంచివార్త చెప్పావంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఈ ట్వీట్‌కు విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. 'పూర్తి ఆరోగ్యంతో, చిరునవ్వుతో తిరిగి వచ్చేవరకు ఎదురు చూస్తుంటాం' అని రాసుకొచ్చాడు.
#Kushi will resume very soon .. my apologies to @TheDeverakonda fans 🙏@ShivaNirvana @MythriOfficial https://t.co/jW6cm9H4Qc
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023
We all await your return in full health and your big smile ❤️ https://t.co/kuSN1ZdGj3
— Vijay Deverakonda (@TheDeverakonda) February 1, 2023
🫶🏻@rajndk https://t.co/JwDGfjdQqS
— Samantha (@Samanthaprabhu2) February 1, 2023
చదవండి: చాలా త్వరగా వెళ్లిపోయావు, మిస్ యూ.. నమ్రత ఎమోషనల్ పోస్ట్
పుట్టింటికి వచ్చినంత సంతోషంగా ఉంది: హన్సిక
Comments
Please login to add a commentAdd a comment