'ఖుషి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే! | Kushi Movie OTT Release Date And OTT Platform Details - Sakshi
Sakshi News home page

Kushi Movie OTT: 'ఖుషి' మూవీ వచ్చేది ఆ ఓటీటీలోనే

Sep 1 2023 10:25 AM | Updated on Sep 1 2023 10:51 AM

Kushi Movie OTT Release Date And Details - Sakshi

విజయ్ దేవరకొండ-సమంత హీరోహీరోయిన్లుగా నటించిన కొత్త సినిమా 'ఖుషి'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీసిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. అయితే దీన్ని నమ్మలేం కాబట్టి జెన్యూన్ రివ్యూ వచ్చే వరకు వెయిట్ చేయండి. సరే ఇదంతా పక్కనబెడితే 'ఖుషి' మూవీ ఏ ఓటీటీలో వచ్చేది ఇప్పుడు తెలిసిపోయింది.

(ఇదీ చదవండి: ఈ తెలుగు హీరోయిన్‌ని గుర్తుపట్టారా? సుప్రీంకోర్టులో ఇ‍ప్పుడు లాయర్‌గా!

'ఖుషి' కథేంటి?
విప్లవ్(విజయ్ దేవరకొండ), ఆరాధ్య(సమంత) లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. తమ విషయం పెద్దలకు చెబితే.. పెళ్లి చేస్తే కష్టమని అంటారు. దీంతో ఇంటినుంచి బయటకొచ్చేసి మ్యారేజ్ చేసుకుంటారు. వివాహ బంధంలోకి తొలుత బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత కలతల మొదలవుతాయి. మరి చివరకు ఏమైంది? విప్లవ్-ఆరాధ్య ఒక్కటయ్యారా లేదా అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

ఆ ఓటీటీలో
శివ నిర్వాణ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీసిన 'ఖుషి' డిజిటల్ రైట్స్ కోసం పలు సంస్థ పోటీ పడ్డాయి. అయితే భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్.. ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకుంది. ఈ ఓటీటీ లెక్క ప్రకారం.. కొత్త సినిమాలు దాదాపు నెల తర్వాత స్ట్రీమింగ్ అవుతుంటాయి. అంటే ఈ మూవీ సెప్టెంబరు 1న థియేటర్లలోకి వచ్చింది కాబట్టి.. అక్టోబరు తొలివారంలో ఓటీటీలోకి అందుబాటులోకి రావొచ్చని తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: చిరంజీవి పూజగదిలో ఆ ఇద్దరి ఫొటోలు..మూలాలు మర్చిపోలేదు)

Advertisement
 
Advertisement
Advertisement