Salman Khan Receives Death Threats From Some Thugs - Sakshi
Sakshi News home page

Salman Khan: చంపేస్తామంటూ సల్మాన్‌ఖాన్‌కు బెదిరింపులు

Jun 5 2022 8:06 PM | Updated on Jun 6 2022 7:08 AM

Salman Khan Receive Death Threats - Sakshi

సల్మాన్‌తో పాటు అతడి తండ్రిని సైతం చంపుతామని లేఖ విడుదల చేశారు. పంజాబ్‌ సింగర్‌ సిద్ధూకు పట్టిన గతే అతడికి కూడా పడుతుందని హెచ్చరించారు. ఈ లేఖతో అప్రమత్తమైన సల్మాన్‌ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ముంబై: బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తామంటూ కొందరు దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. సల్మాన్‌తో పాటు అతడి తండ్రి సలీమ్‌ను సైతం చంపుతామని లేఖ పంపారు. పంజాబ్‌ సింగర్‌ సిద్ధూకు పట్టిన గతే హీరోకు కూడా పడుతుందని అందులో హెచ్చరించారు. ఈ లేఖతో అప్రమత్తమైన సల్మాన్‌ ఆదివారం బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల లేఖ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

కాగా గతంలోనూ బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకను దైవంగా భావించే లారెన్స్‌ బిష్ణోయ్‌.. కృష్ణజింకల వేట కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సల్మాన్‌ను చంపేస్తామని కోర్టు ఆవరణలోనే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు అతడి ముఠా సల్మాన్‌ హత్యకు పథకం పన్నగా పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ​కాగా తీహార్‌ కోర్టులో ఉన్న బిష్ణోయ్‌ ఇటీవలే పంజాబ్‌ సింగర్‌ సిద్ధూను హతమార్చిన నేపథ్యంలో ఈ లేఖకు అతడి ముఠాకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది తెలియాల్సి ఉంది.

చదవండి: నువ్వు వర్జినా? అంటూ నెటిజన్‌ ప్రశ్న, సుశాంత్‌ ఆన్సరేంటంటే?
చై కోసం స్టార్‌ హీరో సినిమాకు నో చెప్పిన సమంత!

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement