Prabhas And Prashanth Neel's For Salaar Shooting Reached Godavarikhani - Sakshi
Sakshi News home page

బొగ్గు గనికి చేరుకున్న ప్రభాస్‌

Jan 29 2021 5:57 PM | Updated on Jan 29 2021 7:43 PM

Salaar: Prabhas Spotted At Salaar Shooting In Godavarikhani - Sakshi

హీరో సినిమా రిలీజయితేనే అభిమానికి ఆనందం. ఆ సినిమాను ఆదరిస్తేనే హీరోకు సంతృప్తి. కానీ లాక్‌డౌన్‌ వల్ల సినిమా షూటింగులు, రిలీజ్‌లు వాయిదా పడటంతో ప్రేక్షక లోకం వినోదాల విందుకు కొంత దూరమైంది. ఓటీటీ కంటెంట్‌ ఉన్నప్పటికీ థియేటర్‌ ఎక్స్‌పీరియన్స్‌ మాత్రం మిస్సయ్యారు. ఈ క్రమంలో మళ్లీ థియేటర్లు ప్రేక్షకలోకానికి స్వాగతం పలుకుతుండటంతో అభిమానుల కన్నా ముందే ఎన్నో చిత్రాలు సినీ మహళ్ల ముందు క్యూ కడుతున్నాయి. అటు హీరోలు కూడా వీలైనంత తొందరగా తమ సినిమాలను పూర్తి చేస్తూ కొత్త ప్రాజెక్టులను మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో మొన్నటివరకు రాధేశ్యామ్‌తో బిజీబిజీగా ఉన్న ప్రభాస్‌ ఇప్పుడు సలార్‌ సెట్స్‌లో అడుగు పెట్టాడు. (చదవండి: ఇది ఫిక్స్‌: సలార్‌లో శృతిహాసన్‌)

కేజీఎఫ్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదటి సన్నివేశాన్ని రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో చిత్రీకరించనున్నారు. ఈమేరకు ఓపెన్‌ కాస్ట్‌ ప్రాంతంలో సెట్‌ సిద్ధం చేయగా ప్రభాస్‌, చిత్రయూనిట్‌తో కలిసి గోదావరిఖని చేరుకున్నాడు. పోలీస్‌ కాన్వాయ్‌ మధ్య అతడిని బొగ్గు గనికి తీసుకువెళ్లారు. ప్రభాస్‌ వస్తున్నాడని తెలిసి అభిమానులు దారిపొడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సలార్‌ సెట్స్‌లో ప్రభాస్‌ అడుగు పెట్టిన వీడియో కూడా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. సుమారు పది రోజుల పాటు ఇక్కడ షూటింగ్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. హోంబలే ఫిలింస్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరంగందూరు నిర్మాణంలో రూపొందుతున్నఈ మూవీకి సినిమాటోగ్రఫీ భువన్‌ గౌడ, సంగీతం రవి బస్రూర్‌ అందిస్తున్నారు. శృతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. (చదవండి: డియర్‌ కామ్రేడ్‌ నా ఫస్ట్‌ సినిమా అయ్యుండేది)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement