రామాయణ కంటే ముందే సాయిపల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ.. | Sai Pallavi first Hindi film to release on December 12 | Sakshi
Sakshi News home page

సాయిపల్లవి బాలీవుడ్‌ ఎంట్రీ.. రామాయణ కంటే ముందు ఆ మూవీ!

Sep 13 2025 4:42 AM | Updated on Sep 13 2025 10:05 AM

Sai Pallavi first Hindi film to release on December 12

హీరోయిన్‌ సాయిపల్లవి హిందీలో నటించిన తొలి చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన రొమాంటిక్‌ లవ్‌స్టోరీ చిత్రం ‘మేరే రహో’. సునీల్‌ పాండే దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్, మన్సూర్‌ ఖాన్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 12న రిలీజ్‌ కానుంది. ఒకరితో ఒకరికి పరిచయం లేని ఓ అబ్బాయి, అమ్మాయి ఓ రోజు విచిత్రకరమైన పరిస్థితుల్లో కలుసుకుంటారు.

ఆ పరిచయం వారి జీవితాలను ఎలా మార్చేసింది? అన్న కోణంలో ఈ ‘మేరే రహో’ సాగుతుందని బాలీవుడ్‌ సమాచారం. తొలుత ఈ సినిమాకు ‘ఏక్‌ దిన్‌’ అనే టైటిల్‌ అనుకున్నారు. నవంబరులో రిలీజ్‌  ప్లాన్‌ చేశారు. శుక్రవారం ఈ సినిమా టైటిల్, విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌. ఈ సినిమా కాకుండా హిందీలో ‘రామాయణ’ సినిమాలో సీతగా సాయిపల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement