ఊరమాస్‌గా సాయి ధరమ్‌ తేజ్‌.. గత్తరలేపిన ‘గాంజా శంకర్‌’ గ్లింప్స్‌ | Sai Dharam Tej, Sampath Nandi Join Hands For Gaanja Shankar | Sakshi
Sakshi News home page

Gaanja Shankar : ఊరమాస్‌గా సాయి ధరమ్‌ తేజ్‌.. గత్తరలేపిన ‘గాంజా శంకర్‌’ గ్లింప్స్‌

Oct 15 2023 10:25 AM | Updated on Oct 15 2023 11:06 AM

Sai Dharam Tej, Sampath Nandi Join Hands For Gaanja Shankar - Sakshi

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజ్‌, సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(అక్టోబర్‌ 15) సాయి తేజ్‌ బర్త్‌డే సందర్భంగా టైటిల్‌ అనౌన్స్‌ చేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ని వదిలారు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్‌’ అని టైటిల్‌ ఖరారు చేశారు.  మాస్‌కి నిర్వచనం ఇవ్వొద్దని, ఫీల్‌ అవ్వమని చెబతూ ‘గాంజా శంకర్‌’ వీడియో గ్లింప్స్‌ ప్రారంభం అవుతుంది.

‘స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు నాన్నా... మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు' అని ఓ  చిన్నారి అడగటంతో 'గాంజా శంకర్' ఇంట్రో మొదలైంది. హీరో పాత్ర ఎలా ఉండబోతుందో ఈ ఇంట్రోలో చూపించారు. గంజాయి అని పేరు చెప్పలేదు కానీ.. హీరో గాంజా అమ్ముతాడనే విషయాన్ని మాత్రం ఈ వీడియో ద్వారా చెప్పేశారు. మొత్తానికి సాయి తేజ్‌ పూర్తి మాస్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. 

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement