ఫ్యాన్స్ నిరాశ... మరోసారి ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా?

RRR In 2022 Summer: Suffering Huge Blow Of Delay - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ గత రెండేళ్లుగా తెలుగు ప్రేక్షకులను ఊరిస్తున్న సినిమా. జూనియర్‌ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్‌ల కథ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా ప్రారంభించేటప్పుడే 2020, జూలై 30వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించారు.  ఈయితే పలు కారణాలతో సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా ఈ అక్టోబర్ 13న సినిమా విడుదల చేస్తామని చిత్రయూనిట్‌ హామీ ఇచ్చింది. కానీ  ఈ అక్టోబర్‌లో సైతం మూవీ రిలీజ్‌ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా మరోసారి రిలీజ్‌ డేట్‌ను పోస్ట్‌పోన్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం కోవిడ్‌ రెండో దశ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో అన్ని సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడింది. దీంతో అనుకున్న సమయానికి ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రీకరణ కూడా నిలిచిపోయింది. దీంతో టైంకు షూటింగ్‌ పోస్ట్‌ ప్రొక్షన్‌ పనులు పూర్తయ్యేలా కనిపించకపోవడంతో మరోసారి విడుదల తేదీ వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.  వచ్చే ఏడాది సంక్రాంతికి గానీ, వేసవిలో గానీ రిలీజ్‌ చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  చదవండి:  (RRR Movie : ఆ పాట కంటతడి పెట్టిస్తుందట)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top