RGV Sensational Tweet on Chiranjeevi and Ramcharan Promotional Video - Sakshi
Sakshi News home page

RGV : చిరంజీవి-చరణ్‌ వీడియోపై వర్మ సంచలన కామెంట్స్‌

Apr 17 2022 11:44 AM | Updated on Apr 17 2022 4:13 PM

RGV Sensational Tweet About Chiranjeevi Ram Charan Promotional Video - Sakshi

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. రామ్‌చరణ్‌ ఇందులో కీలక పాత్రలో నటించారు. ఏప్రిల్‌29న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. విడుదల తేది దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది మూవీ యూనిట్‌ తాజాగా ఈ సినిమాలోని ‘భలే భలే బంజారా’సాంగ్‌ విడుదల తేదిని ప్రకటిస్తూ ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేశారు.

నువ్వు నన్ను డామినేట్ చేస్తావా అంటూ చిరు- చరణ్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వీడియోపై రామ్‌గోపాల్‌ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

'నేను బాగా హర్ట్‌ అయ్యాను. వాళ్లిద్దరు సినిమా గురించి మాట్లాడుతూ తగ్గను తగ్గెదేలే.. అని అల్లు అర్జున్‌ డైలాగులు వాడటం చూస్తుంటే బన్నీ న్యూ మెగా హీరో అని చరణ్, చిరంజీవి రుజువు చేసినట్లు ఉంది' అంటూ వర్మ ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement