Reasons Behind Actor Dhanush And Aishwarya Rajinikanth Divorce In Telugu - Sakshi
Sakshi News home page

Dhanush Divorce: విడాకుల ప్రకటనకు ముందు రజనీకి ధనుష్‌ ఫోన్‌ కాల్‌.. కారణం ఇదేనా?

Jan 18 2022 1:06 PM | Updated on Jan 18 2022 4:57 PM

Reasons Behinds Dhnush And Aishwaryaa Rajinikanth Divorce - Sakshi

 విడాకుల నిర్ణయానికి ముందు ఇద్దరూ రజనీకాంత్‌కు ఫోన్‌ చేశారట

కోలీవుడ్‌లో బ్యూటిఫుల్‌ కపూల్‌గా గుర్తింపుపొందిన ధనుష్‌, ఐశ్వర్యలు విడిపోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ స్టార్‌ కపూల్‌.. విడాకులు తీసుకోవడం అభిమానుకులకు మింగుడుపడటం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ.. 18 ఏళ్ల తర్వాత తమ  వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోమవారం ప్రకటించారు. స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికామని, ఇప్పుడు విడిపోవాలాని నిర్ణయం తీసుకున్నామని, తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ సోషల్‌ మీడియా వేదికగా ధనుష్‌, ఐశ్వర్య అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 



అయితే వివాదాలకు చాలా దూరంగా ఉండే ఈ జంట.. అకస్మాత్తుగా విడిపోవడానికి కారణం ఇవేనంటూ అనేక కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్నేళ్ల క్రితం జరిగిన సుచిలీక్స్ ఉదంతంలో ధనుష్ ఫొటోలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే .ఆ సమయంలో ధనుష్‌-ఐశ్వర్యల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. మామగారి(రజనీకాంత్‌)జోక్యంతో మళ్లీ వీరు కలిసిపోయారు. అయితే ఈ సారి ధనుష్‌ కారణంగానే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ధనుష్‌ ఓ హీరోయిన్‌తో చనువుగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని, అందుకే గత కొంతకాలంగా ఐశ్వర్య దూరంగా ఉంటుందని తెలుస్తోంది. ధనుష్‌కు ఉన్న అఫెర్లను ఐశ్వర్య చాలా కాలంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

మరోవైపు  రజనీకాంత్‌ హీరోగా ధనుష్‌ నిర్మించిన ‘కాలా’సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రజనీకాంత్‌  ఆర్థికంగా ఆదుకోలేదని, అప్పటి నుంచి ధనుష్‌ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. ధనుష్‌తో ఐశ్వర్య ఓ పాన్‌ ఇండియా సినిమా నిర్మించాలని ప్రయత్నించగా.. ఆయన ఒప్పుకోలేదని , ఈగోల కారణంగానే వీరిద్దరు విడిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు చాలా సార్లు కౌన్సిలింగ్‌ ఇచ్చినప్పటికీ.. తమ నిర్ణయాన్ని మార్చుకోలేమని చెప్పి సోమవారం సోషల్‌ మీడియా ద్వారా విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల నిర్ణయానికి ముందు ఇద్దరూ రజనీకాంత్‌కు ఫోన్‌ చేశారట. అయితే రజనీకాంత్‌ మాత్రం ఆ నిర్ణయాన్ని వారిద్దరకే వదిలేసినట్లు తెలుస్తోంది. కాగా, ధనుష్‌, ఐశ్వర్యల వివాహం 2004, నవంబరు 18న జరిగింది. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement