హ్యాపీ బర్త్‌డే మై డార్లింగ్‌, మిస్‌ యూ : రష్మిక | Rashmika Mandanna Special Wishes To Her Baby Sister Shiman Mandanna Birthday | Sakshi
Sakshi News home page

తన చిట్టి చెల్లి బర్త్‌డే, విచారణ వ్యక్తం చేసిన రష్మిక

May 2 2021 3:02 PM | Updated on May 2 2021 3:30 PM

Rashmika Mandanna Special Wishes To Her Baby Sister Shiman Mandanna Birthday - Sakshi

తన చిట్టి చెల్లెలు షిమాన్‌ మందన్నా పుట్టిన రోజు సందర్భంగా హీరోయిన్‌ రష్మిక మందన్నా ఆమెకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఇందుకోసం షిమాన్‌తో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ చిట్టి చెల్లిపై ఉన్న ప్రేమను పంచుకుంది. ప్రస్తుతం రష్మిక పోస్టు చేసిన ఈ ఫొటోలు ఆమె అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఆమె పుట్టిన రోజున తనతో లేనందుకు రష్మిక విచారణ కూడా వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం రష్మిక షూటింగ్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 

కాగా తన సోదరి షిమాన్‌ను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను రష్మిక ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేస్తూ ఇలా రాసుకొచ్చింది. ‘హ్యాపీ బర్త్‌డే మై డార్లింగ్‌ బేబీ.. సిస్టా లవ్స్‌ యూ మోస్ట్‌. మిమ్మల్ని నేను ఎప్పుడూ బాధ పెట్టను. పరిస్థితులు అన్ని సాధారణ స్థితికి రాగానే ఇంటికి తిరిగి వచ్చేస్తా. అప్పుడు మీ పుట్టిన రోజు స్పెషల్‌గా జరుపుకుందాం మై డార్లింగ్‌’ అంటూ రాసుకొచ్చింది. కాగా ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్‌ సరసన పుష్ప మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. పుష్పతో పాటు బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌తో కలిసి గుడ్‌బై మూవీలో కూడా ఆమె నటిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంటున్న పుష్ఫ మూవీ  కరోనా కారణంగా వాయిదా పడింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement