జీవితం అనేది యుద్ధం  | ram rapid action mission official trailer released by sailesh kolanu | Sakshi
Sakshi News home page

జీవితం అనేది యుద్ధం 

Jan 12 2024 2:28 AM | Updated on Jan 12 2024 2:28 AM

ram rapid action mission official trailer released by sailesh kolanu - Sakshi

సూర్య, ధన్యా బాలకృష్ణ 

సూర్య అయ్యల సోమయాజుల హీరోగా, మిహిరామ్‌ వైనతేయ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ర్యాపిడ్‌ యాక్షన్‌ మిషన్‌’. ఇందులో ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌. దీపికాంజలి వడ్లమాని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ను డైరెక్టర్‌ శైలేష్‌ కొలను విడుదల చేశారు. ‘జీవితం అనేది ఒక యుద్దం.. చుట్టూ మనుషులు ఉన్నా లేకపోయినా.. నీ పోరాటం నువ్వే చేయాలి.. ఆ పోరాటంలో నా రామ్‌ గెలుస్తాడని నాకు నమ్మకం ఉంది’ అనే డైలాగ్స్‌తో ట్రైలర్‌ సాగుతుంది.

‘ఈ 60 ఏళ్ల స్వాతంత్య్రం ప్రజలది కాదు... అధికారులది కాదు... రాజకీయ నాయకులది మాత్రమే... మీరు అప్పుడూ బానిసలే... ఇప్పుడూ బానిసలే... ఎప్పుడూ బానిసలే’ అంటూ ‘శుభలేఖ’ సుధాకర్‌ చెప్పిన డైలాగ్‌ కూడా ఉంది. ‘‘దేశభక్తి నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement